Monday, February 27, 2017

ఉబ్బసం ( ASTHMA )

Asthama


*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

      *ఉబ్బసం ( ASTHMA )*

    ఊపిరి తిత్తులలో గాలి మార్గం కుంచించుక పోయినపుడు , శ్వాస పీల్చుకొనుటలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనినే *ఆస్తమా* అంటారు . దుమ్ము , ధూళి , పొగ వున్న ఇంటిలో నివసించడము వలన ఆస్తమా వస్తుంది . కొందరిలో వంశ పారంపరముగా వుంటుంది . ఎక్కువగా ధూమ పానం చేసే వారిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా వుంటుంది . ఆపుడప్పుడు ఆస్తమా ఎక్కువగా వుండును . తగ్గుతూ , పెరుగుతూ వుంటుంది . ఈ శ్లేష్మం బయటకు వచ్చినప్పుడు రోగికి ఇబ్బందిగా వుండదు . అపుడప్పుడు కఫం వస్తూ వుంటుంది . శ్లేష్మం బయటకు రాని యెడల శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా వుండును .

*గృహ చికిత్సలు*: ----

1. బిరియాని ఆకుల చూర్ణం + అల్లం రసంలో కలిపి తీసుకొన వలెను . చాలా ఉపయోగకరముగా ఉండును .

2 . 3 or 4 spoon ల అల్లం రసం + తేనెను కలిపి త్రాగవలెను .
( ప్రాతః కాలములో పరగడపున త్రాగవలెను .)

3 . 2 spoon ల అతి మధురము  + 250 gms.నీళ్ళలో కలిపి మరిగించ వలెను . 1/4 భాగము అయ్యే వరకు మరగించ వలెను.
( ఈ కషాయం ను ప్రతి రోజు ఉదయం , సాయంత్రం భోజనం తర్వాత త్రాగవలెను. )

4 . కొన్ని తులసి ఆకులు + 2 లేక 3   నల్ల మిరియాలను కలిపి , నమిలి , నమిలి తినవలెను .

5 . చిన్న అల్లం ముక్క మీద నిమ్మరసం పిండి , నోటిలో పెట్టుకొని చప్పరించండి .

6. నిమ్మ కాయ రసం + తేనెను కలిపి తీసుకొండి . దగ్గు నుండి ఉపశమనం పొందండి .

7 . ఉబ్బసం ఎక్కువగా వున్నప్పుడు , పటిక  ( Alum ) ముక్కను నోటిలో పెట్టుకొని చప్పరించండి . వెంటనే ఉపశమనం కలుగుతుంది .

8 . రోగి యొక్క ఛాతి మీద వేడి నీళ్ళతో కాపడం పెట్టండి . వెంటనే ఉపశమనం కలుగుతుంది .

9 . రోగి శ్వాస తీసుకోవడం కష్టంగా వున్నప్పుడు , వేడి నీళ్ళు త్రాగవలెను . వెంటనే ఉపశమనం కలుగుతుంది .

10 . సైంధవ లవణం +  స్వదేశీ ఆవు నెయ్యిలో కలిపి ఛాతి మీద పూయండి . చాలా ఉపశమనం కలుగుతుంది .

11 . ఎర్ర ముల్లంగి దుంప రసం + క్యారెట్ రసం + క్యారెట్ రసం +  క్యాబేజి రసంలను సమ పాళ్ళలో కలిపి త్రాగండి .

12 . 3 spoon ల మెంతులు + 1 గ్లాసు నీళ్ళలో వేసి మరిగింఛ వలెను . నీళ్ళను వడబోసి మెంతులను తీసి వేసి , నీళ్ళను మాత్రమే త్రాగవలెను .

13. హార్ సింగారు చెట్టు యొక్క చెట్టు బెరడు చూర్ణం +  తమల పాకులో పెట్టకుని తినండి . ఆస్తమ గణనీయంగా తగ్గుతుంది .

14 . తులసి ఆకుల రసం + అల్లం రసం లను సమ పాళ్ళలో కలపండి . ఆ మిశ్రమం + తేనెను కలిపి త్రాగండి .

15 . ఎల్లి పాయ  ( garlic ) రెబ్బ పైన లవంగం నూనెను 2 లేక 3 చుక్కలను వేసి , నోటిలో పెట్టుకొని చప్పరించండి . తర్వాత వేడి నీళ్ళు త్రాగండి .

16 . కొన్ని లవంగాలను + 1 గ్లాసు నీళ్ళలో వేసి మరిగించండి . ఆ కషాయంలో తేనెను కలిపి త్రాగండి .

17 . 1/2 గ్లాసు చీని పండ్ల రసం + కొద్దిగా వేడి నీళ్ళ + కొద్దిగా వేయించిన జీలకర్ర + సొంఠి పొడిని కలిపి త్రాగండి .

18 . పాత పసుపు పొడి + 2 spoon ల  తేనెలో కలిపి తీసుకొండి . ఈ ఔషధం ఆస్తమాకు రామ బాణం .

     పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

     *శ్రీ రాజీవ్ దీక్షిత్*