Tuesday, February 21, 2017

రాజీవ్ దీక్షిత్ స్వదేశీ చికిత్స

*రాజీవ్ దీక్షిత్ స్వదేశీ చికిత్స*

   *మల బద్ధకం. ( అజీర్ణం , గ్యాస్ )*

  మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది . అక్కడ *అగ్ని ( జఠరాగ్ని )* ప్రదీప్తమవుతుంది . ఇది ప్రధానమైన విషయం .
# తిన్న ఆహారం 3 గంటలలో జీర్ణమైపోవాలి . అలా జీర్ణం కాని ఆహారం ముందుకు కదలదు .
#  కుళ్ళిన ఆహారం నుండి విష వాయువులు తయారవుతాయి . ఈ విష వాయువుల వలన 103 రోగాలు వస్తాయి .
#  ఎక్కువ కాలం అజీర్తి వుండటం వలన మలబద్ధకం వస్తుంది . సరైన పద్ధతిలో మలం విసర్జించ బడదు .
#  అపక్వమైన ఆహారం భుజించడం , రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం , శోకం , దుఃఖము , ఎక్కువగా చింతించడము మొదలగు కారాణాల వలన కూడా మలబద్ధకం వస్తుంది .

*గృహ చికిత్సలు* : ---

1. *అల్లం పేస్ట్* + *నల్ల ఉప్పు* కలిపి తీసుకొన వలెను.
( విష వాయువులు ( Gas ) బయటకు వచ్చును .

2 . *అల్లం రసం* + *పుదీన రసం* + *నిమ్మ రసం* లను కలిపి తీసు కొనవలెను .

3 . *అల్లం రసం*  + *నిమ్మ రసం* + *పుదీన రసం*  + *తేనె* కలిపి తీసు కొనవలెను .

4 . *సొంఠి* + *మిరియాలు*  + *పిపిళ్ళు* లను సమ పాళ్ళలో తీసుకొని చూర్ణం తయారు చేసు కొనవలెను.
ప్రతి రోజు ఉదయం , సాయంత్రం 1 Table Spoon చూర్ణం ని తీసు కొన వలెను . *మలబద్ధకం* తగ్గి పోవును .

5 . *అల్లం* + *ధనియాలు* కలిపి కషాయం తయారు చేసుకొని త్రాగండి .

6 . *పుదీన రసం* + *బెల్లం* కలిపి త్రాగండి .

7 *సొంఠి* + *పెద్ద యాలక్కు* + *దాల్చిన చెక్క*లను సమ పాళ్ళలో తీసుకొని పొడి ( చూర్ణం ) ని తయారు చేసుకొన వలెను.
1 Table Spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి .

8 . 1 గ్లాసు *వేడి నీళ్ళ* లో + *నిమ్మ రసం* కలిపి త్రాగండి .

9. రాత్రి *రాగి*పాత్రలో వుంచిన నీళ్ళను ప్రాతః కాలం కాలకృత్యాలకు ముందు త్రాగండి .

10 . 1 Table Spoon *త్రిఫల చూర్ణం* + 1 గ్లాసు *వేడి ఆవు పాళ్ళలో* కలిపి , రాత్రి భోజనం తర్వాత త్రాగండి .

11 . 1/2 Table Spoon *పిపిళ్ళ* చూర్ణం + *బెల్లం* కలిపి తీసు కొన వలెను .

12. *సొంఠి* + *కరక్కాయ* + *వాము* సమ పాళ్ళలో కలిపి , ఒక గ్లాసు నీళ్ళలో కలిపి మరిగించండి . ఆ నీళ్ళలో *నల్ల ఉప్పు* కలిపి త్రాగండి .

13 . *క్యారట్* ని నమిలి , నమిలి తినండి .

14 . *తిప్ప తీగ చూర్ణం*  + *బెల్లం* కలిపి తీసుకొన వలెను .

15 . ప్రతి రోజు భోజనంలో *బొప్పాయి పండు*ని సేవించండి .

16 . *ఎల్లి పాయ ( Garlic )* ని నమిలి , నమిలి తినండి . అజీర్ణం వలన వచ్చిన కడుపు నొప్పి తగ్గి పోవును .

17 . 1 Table Spoon *సొంఠి పొండి* + 1 గ్లాసు *నీళ్ళలో* కలిపి మరిగించండి . తర్వాత సైంధవ లవణం కలిపి త్రాగండి . *అజీర్ణ రోగం* తగ్గుతుంది .

18 . *ఆవు పెరుగు* లో చిన్న , చిన్న *ఉల్లి పాయ ( Onion )* ముక్కలు కలిపి తీసుకొండి .

  పై గృహ చికిత్స విధానాలలో ఏదో ఒకటి ఆచరించి , సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి .

  *శ్రీ రాజీవ్ దీక్షిత్*

1 comment:

మొరుపుటాల . సతీష్ కుమార్ said...

సర్ నమస్తే ఆడోనాయిడ్స్ కి ఏదన్న చికిత్స ఉంటె చెప్పగలరు