Wednesday, February 22, 2017

ముక్కులో రక్త స్రావం.రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

     *ముక్కులో రక్త స్రావం*

    ముక్కులో గాయం కావడం , infection , తల ఎక్కవ వేడిగా వుండడము మొదలగు కారణాల వలన ముక్కు నుండి తరచుగా రక్తం కారడం జరుగుతుంది . ఈ జబ్బు పిల్లలలో ఎక్కువగా వుంటుంది .

గృహ చికిత్సలు : -----

1. మొట్ట మొదట క్రింద పడుకోబెట్టి , చల్లని నీళ్ళతో తలను మాత్రం తడపండి . ముక్కులో నుండి రక్తం రావడం తగ్గుతుంది .

2 . ఉసరి కాయ పేష్ట్ ను తయారు చెయ్యండి . ఆ పేష్ట్ ని ఆవు నెయ్యిలో వేసి వేయించి , ముక్కు పైన లేపనంగా పూయండి .

3 . ఫక్వమైన అరటి పండులో ఆవు నెయ్యి కలిపి తినండి .

4 . ముల్తాన్ మట్టిని రాత్రి నీళ్ళలో నాన బెట్టండి . ఉదయం ముక్కు మీద లేపనంగా పూయండి . రక్త స్రావం తగ్గి పోతుంది .

5 . నిమ్మ కాయ రసం + ఉసరి కాయ రసంను సమపాళ్ళలో కలిపి , కొన్ని చుక్కలను ముక్కులో వేయండి . రక్త స్రావం తగ్గి పోతుంది .

6 . ఉల్లి పాయ రసంను వేడి చేసి ముక్కులో 1 -2 చుక్కలు వేయండి .

7 . కొత్తి మీర రసంలో కొద్దిగా కర్పూరంను కలిపి రెండు , రెండు చుక్కలు రెండు ముక్కు రంధ్రాలలో వేయండి .

8 . ఉసరి కాయ పొడి + అతి మధురము పొడులను సమ పాళ్ళలో కలిపి ఒక చూర్ణంగా తయారు చెయ్యండి .
1 Spoon చూర్ణం + 1 గ్లాసు ఆవు పాలలో కలిపి ఉదయం , సాయంత్రం త్రాగండి .

9 . పటిక ( Alum ) ని లేపనంగా ముక్కు పైన పూయండి .

       పై వాటిలో ఏదో ఒక పద్ధతిని ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

     *శ్రీ రాజీవ్ దీక్షిత్*

సేకరణ : సురేశ్ గారు

No comments: