Sunday, February 26, 2017

Home remidies for piles


      *మొలలు ( Piles )*
------------_---------_---------



     *మలబద్ధకం* వలన మొలల వ్యాధి వస్తుంది . మల విసర్జన సజావుగా , సులభముగా , నిరాటంకంగా జరగక పోవడం వలన ఫైల్స్ తయారవుతాయి . దీర్ఘ కాలం నుంచి విరేచనాలు లేదా మలబద్ధకం బాదిస్తున్నప్పుడు మలద్వారం మీద ఒత్తిడి పెరిగి ఫైల్స్ తయారవుతాయి . ఎక్కువ సమయం పాటు ఒకే భంగిమలో కూర్చోవటం , నిలబడటం వంటివి చేయాల్సిన వృత్తుల్లో వుండే వారికి ఫైల్స్ తయారయ్యే అవకాశం ఎక్కువ .
# ఈ జబ్బు వున్న వాళ్ళకు మలం చాలా కష్టం గా , బాధగా బయటకు వస్తుంది . నొప్పి ఎక్కువ , రక్తస్రావం ఎక్కువ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది . మలద్వారం దగ్గర దురద , వాపు , ఎర్రగా మారుతుంది . మలద్వారం గుండా చీము లేదా రక్తస్రావం జరుగుతుంది .
*గృహ చికిత్సలు*

# 10 గ్రాముల *ఉసరిక పోడి* + *తేనె* ను కలిపి ఉదయం , సాయంత్రం తీసుకొనవలెను.

# 1 tea spoon *ఉసరిక పొడి*
    + *పెరుగు* కలిపి తీసుకొనవల వలెను .

# 1 గ్లాసు *ముల్లంగి రసం* + *నల్ల ఉప్పు* కలిపి తీసుకొన వలెను .

# 1/2 గ్లాసు *క్యారట్ రసం*  + 1/2 గ్లాసు *పాల కూర రసం* కలిపి త్రాగ.వలెను .

# ఉదయం , సాయంత్రం *మేక పాల*ను త్రాగవలెను .

# *కాకర కాయ రసం*  + *పటిక బెల్లం పొడి* ని కలిపి త్రాగండి .

# *ఉల్లి పాయ రసం ( Onion )* + *ఆవు నెయ్యి*  +  *పటిక బెల్లం* ను కలిపి త్రాగండి .

# 10 గ్రాముల *త్రిఫల చూర్ణం*  + *తేనె* ను బాగా కలిపి తీసుకొనండి .

# ప్రతి రోజు ఉదయం పరగడపున విత్తనాలు కలిగిన పక్వమైన *జామ పండ్లు* 3 లేక 4 తినవలెను .

# 1  tea spoon *చిన్న పిపళ్ళ చూర్ణం* +  *తేనె* ను కలిపి తీసుకొన వలెను .

# *పెద్ద యాలకు* ని కాల్చండి. ఆ *చూర్ణం* ని ప్రతి దినము ఉదయము , మధ్యాహ్నం , సాయంత్రం 1 గ్లాసు *నీళ్ళ* లో కలిపి త్రాగండి . ప్రతి సారి ఒక పెద్ద యాలకుల చూర్ణం తయారు చేసుకొనవలెను .

# *నల్ల నువ్వులు* + *తాజా ఆవు వెన్న* ని సమపాళ్ళలో కలిపి తీసుకొనండి .

# *కరక్కాయ చూర్ణం*  + *బెల్లం* ని కలిపి తీసుకొనండి .

పై పద్దతులలో ఏదో ఒక చికిత్స విధానంను ఆచరించి మొలల నుండి నివారణ పొందండి .

*లేపనము* : ---
#*వేప నూనె ని మొలలపై పూయండి .
# చేదు బీరకాయ +  పసుపు పొడిని కలిపి పేస్ట్ లాగా తయారు చేసి మొలలపైన పూయండి .
# పొగాకు చెట్టం ఆకుల పేస్ట్ ని మొలలకు పూయండి .

     పై లేపనాలలో ఏదో ఒక చికిత్స పద్దతిని వాడి మొలల నొప్పి నుండి నివారణ పొందండి .

---- *శ్రీ రాజీవ్ దీక్షిత్*



No comments: