Saturday, March 11, 2017

నోటిలో బొబ్బలు-Blisters and solution

*నోటిలో బొబ్బలు ( Blisters )
-----------------------------------


   తరచుగా నోటిలో బొబ్బలు రావడం . కడుపులో అనారోగ్యం , ఎక్కువగా వేడి , వేడి పదార్ధాలు తినడం , జఠర గ్రంధి సరిగా పని చేయక పోవడం , రక్తం శుద్దిగా లేక పోవడం , మొదలగు కారణాల వలన  నోటిలో బొబ్బలు వస్తాయి . ఈ బొబ్బలు నాలుక పైన , నాలుక కొన మీద రావడం జరుగుతుంది. బొబ్బల వలన అప్పుడప్పుడు నోటిలో నుండి నీరు కారడం , నోటిలో మంట , నోటిలో నొప్పి వుండును . పెదవులపైన కూడా బొబ్బలు వస్తాయి .

*గృహ చికిత్సలు* : -----

1. సోంపు పొడి + 1 గ్లాసు నీళ్ళలో కలిపి పుక్కిలించి , ఉమ్మి వేయండి .

2 .తులసి ఆకుల రసంను నాలుక మరియు దంతాలపైన పూయండి .

3 . 2 tea spoon ల పసుపు పొడి + 1 గ్లాసు నీళ్ళు మరగించి ,ఆ నీళ్ళతో పుక్కిళించి , ఉమ్మివేయండి .

4 . బెల్లం ముక్కని నోటిలో పెట్టుకొని , చప్పరించండి .

5 . 1 గ్లాసు ఆవు పాలలో + 1 spoon ఆవు నెయ్యిని కలిపి త్రాగండి .

6 . పచ్చి కాకర కాయ రసం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , పుక్కిళించి , ఉమ్మి వేయండి .

7 . కొన్ని తాజా పుదీన ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో మరిగించండి . చల్లారిన తర్వాత , ఆ నీళ్ళను నోటిలో వేసుకొని ఉమ్మి వేయండి .

8 . ఆవు నెయ్యి + కర్పూరంను వేసి వేడి చేసి , చల్లారిన తర్వాత బొబ్బల పైన పూయండి . బొబ్బలు ఖచ్చితంగా తగ్గిపోతాయి .

9 .  కొన్ని మెంతులను 1 గ్లాసు నీళ్ళలో వేసి మరిగించండి . ఆ నీళ్ళను పుక్కిళించి , ఉమ్మి వేయండి .

10 . తాజా గోరింట ఆకులను బాగా నమలండి . ఆకులను ఉమ్మి వేయండి .

11 . తాజా గోరింట ఆకులతో కషాయం తయారు చెయ్యండి . ఆ నీళ్ళను పుక్కిలించి , ఉమ్మి వేయండి .

   పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

*గమనిక :----*
  పుక్కిలించడము అంటే చేసిన కషాయాన్ని నోటిలో కొద్ది , కొద్దిగా వేసుకొని , నోటిలో ఆ కషాయంని బాగా కలియ త్రిప్పవలెను . కలియ త్రిప్పిన తర్వాత ఉమ్మి వేయ వలెను .

        *శ్రీ రాజీవ్ దీక్షిత్*


No comments: