Thursday, March 23, 2017

బరువు పెరుగుట ఎలా మరియు ఆహారపు అలవాట్లు

*బరువు పెరుగుట ఎలా?*
*****************


      కొందరు బాగా బక్కచిక్కి పొయి , కొందరు అస్తి పంజిరంలాగా కనిపిస్తూంటారు . ఇది వాతరోగమే . ఎందుకంటే వాయువు వాళ్ళని ఆరబెట్టేసింది . స్దులకాయులు కూడా వాత రోగులే . ఎందుకంటే వారిలో వాయువు జొరబడింది .
# ఈ క్రింది  3 పద్ధతులలో *ఏదో ఒక పద్ధతి*ని  ఆచరిస్తే ఖచ్చితంగా బరువు పెరుగుతారు .

1 . *ఉదయం పరగడపున ఒక గ్లాసు స్వఛ్చమైన దేశీయ ఆవు పాలలో 1 స్పూన్ తేనెను బాగా కలిపి త్రాగండి*
2. *రాత్రి నిద్రపోయే ముందు 10 ఎండు ద్రాక్ష పండ్లు తిని నీళ్ళు త్రాగండి . వెంటనే నిద్ర పోవలెను.*
3 .*ప్రతి రోజు 2 లేక 3 అరటి పండ్లు తినవలెను . తర్వాత వెంటనే ఒక గ్లాసు ఆవు పాలను త్రాగవలెను . ( Chemical Free  అరటి పండ్లు తినవలెను ).


# అధిక క్యాలరీలను అందించే కార్బోహైడ్రేట్ , ప్రోటీన్ మరియు ఆరోగ్యకర కొవ్వు పదార్ధాలను తినడము వలన పెరుగుతారు .
# కార్బోహైడ్రేట్ లు అధికంగా ఉండే ఆహారం . బంగాళదుంప , చిలకడదుంప , బీన్స్ , రైస్ , పండ్లు మరియు కూరగాయలు .
# ప్రోటీన్ లు అధికంగా ఉండే ఆహారాలు చికెన్ , గుడ్లు , సాల్మన్ చేప , పాలు మరియు కాటేజ్ చీస్ లలో ప్రోటీన్ లు అధికంగా ఉంటాయి .

*గమనిక : ప్రస్దుత పరిస్ధితులలో  బరువు పెరగడం ఆరోగ్యకరము కాదు . పైగా అనారోగ్యము కలుగును* .

*ఆహారం* : --
# వంటకాలలో నువ్వుల నూనెను వాడవలెను .
# ఇడ్లీ , దోశ , జొన్నరొట్టెలు , రాగి , సజ్జ ( సద్ధ) రొట్టెలను తినవలెను .
# ముడి బియ్యం లేక సింగిల్ పాలీష్ బియ్యంని వాడండి .
# *తాజా పండ్లు* :-
అరటి పండ్లు ( Chemical Free ) , సపోట , బొప్పాయి , సీతాఫలం , దానిమ్మ ,పండ్లు తీసుకోండి .
# మధ్యాహ్నం భోజనానికి అరగంట మందు పండ్లను తినవలెను .
# బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినవలెను . అప్పుడు కడుపులోని మలినాలను తీసేస్తుంది .
# భోజనం చేసిన తర్వాత ఎటువంటి పండ్లను తినరాదు . రాత్రి పూట పండ్లు తినరాదు .
# అన్ని రకాల ఆకుకూరలను తినవలెను .

# *Dry Fruits*
          ఖర్జూరం , జీడిపప్పు , బాదాం , వట్టి ద్రాక్షలు మంచివి .
# ఉప్పు , కారం చాలా మితంగా వాడాలి .
# నల్ల నువ్వులు + బెల్లంతో చేసిన లడ్డులను తినవలెను .
# ప్రతి రోజు కొన్ని వేరు శెనగ గింజలు తినవలెను .
# అల్లం , వెల్లుల్లి ఆకలికి , అరుగుదలకు చాలా మంచిది .
# దేశీయ ఆవు నెయ్యినే వాడండి .
నెయ్యితో చేసిన పాయసాలు తినవలెను .
# క్యారట్ హల్వ ఆవు నెయ్యితో చేసినది తినవలెను .
# బూడిద గుమ్మడి కాయల వడియాలు తినవలెను .
# గోధుమలు , మైదాతో చేసిన పదార్ధాలు , పిజ్జా , బర్గర్లు మరియు ఫాస్ట్ పుడ్స్ తినడం మంచిది కాదు .
*పాటించ వలసిన నియమాలు* :-
# ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి .
# రాత్రి 10 గంటలకు నిద్రపోవలెను .
#తగినంత నిద్ర , విశ్రాంతి అవసరం .
# మితమైన వ్యాయమం , ప్రాణాయమం , యోగా అవసరం .
# ఉదయం ఎర్రటి సూర్యరశ్మిలో 5 లేక 10 నిమిషాలు నిల్చోండి .
# ఉదయం 8 గంటలకు అల్పాహారం , మధ్యాహ్నం 1 లేక 2 గంటలలోపు భోజనం , రాత్రి 8 గంటలకు భోజనం చేయ వలెను . ప్రతి రోజు ఆహారాన్ని ఒకే సమయానికి తీసుకోవాలి .
# రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత నిద్రపోవాలి .

*నీళ్ళు త్రాగే విధానం* : --

# నీటిని గుటక గుటకగా చప్పరిస్తు త్రాగాలి .
# బ్రేక్ ఫాస్ట్ , భోజనమునకు 1  గంట ముందు నీళ్ళు త్రాగాలి . భోజనము తర్వాత  1 1/2   తర్వాత త్రాగాలి . భోజనము మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును . భోజనం ముగించాక గొంతు శుద్ది కోసం , గొంతు సాఫీగా ఉంచటానికి 2లేక 3 గుటకల నీరు త్రాగ వచ్ఛును .
# మీరు ఆరోగ్యంగా బరువు పెరగాలంటే మీరు తీసుకున్న ఆహారము చక్కగా జీర్ణము కావాలంటే మీరు సరైన విధానములో నీళ్ళు త్రాగాలి .
# సైంధవ లవణం ( Rock Salt ) ను వాడవలెను .
*వంట నూనెలు* :--
# ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ ( Refined Oils) ని వాడరాదు .
# మీరు Non Refined Oils ని వాడండి .
# వంటకు మట్టి పాత్రలు లేక ఇత్తడి పాత్రలు వాడండి .
# బక్క చిక్కిన వాళ్ళు నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బరువు పెరుగుతారు . స్తూలకాయులు బరువు తగ్గుతారు .
# బలహీనంగా ఉన్నవాళ్ళు , వృద్దులు గోరు వెచ్చని నీటితో స్నానం చేయవలెను .
# స్నానం చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి .
# ఏదైనా తిన్న వెంటనే స్నానం చేయ కూడదు .
*గమనిక*
# బరువు పెరగడం అవసరమే అయినా కొవ్వు పెరగడం అనర్ధ దాయకం .
# మీరు చక్కగా ఆరోగ్యకరముగా బరువు పెరిగేందుకు ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే చాలు . అదే విధంగా కొన్ని వ్యాయామాల్ని చేస్తే సరిపోతుంది .
# తగినంత బరువు ప్రాప్తించిన తర్వాత , ఇక పై మరింత బరువు పెరగకుండా తగు జాగ్రత్తలతో ఆహారంలో మార్పులు చేసుకోవాలి .
*శ్రీ రాజీవ్ దీక్షిత్ & ఆయుర్వేదం* ....


No comments: