Sunday, March 19, 2017

ఆరోగ్యమైన పానీయాలు Health drinks

*ఆరోగ్యమైన పానీయాలు ( Healthy Drinks )*



మన భారత దేశ వాతావరణానికి కాఫీ , టీలు మంచివి కాదు .
కాఫీ , టీలు త్రాగడం వల్ల వచ్చే ప్రమాధం అందులోని చక్కెర వల్లనే .
ప్రతి ఒక్కరు ఈ బలవర్ధకమైన పానీయాలను త్రాగండి . ఆరోగ్యాన్ని పొందండి.
6 - 7 నెలల వయస్సు వున్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ త్రాగ వచ్చు .
ఏవైన ధాన్యాల్ని మొలకెత్తించి వాడటాన్ని *మాల్ట్* అంటారు .
ఇంట్లో తయారు చేసుకొనే మాల్ట్ లు మంచివి .
రాగి మాల్ట్ అన్ని వయసుల వారికి ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా అవసరమయ్యే పెరుగుదల వున్న పిల్లలకు చాలా మంచిది .
స్ధూలకాయాన్ని నివారిస్తుంది .
మాల్ట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే పిల్లలు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది .
    Healthy Drinks.

1. రాగి మాల్ట్ తో జావ చేసుకొని త్రాగండి .
ఈ జావలో యాలకుల పొడి , మిరియాల పొడి , బాదం పొడి , పిస్తా పొడులను కూడా కలప వచ్చును. ( మీ రుచికి తగ్గట్టుగా కావలసిన పదార్ధాలను కలుపుకొండి ) .

2. బార్లే జావ త్రాగండి .

3 . 1 గ్లాసు నీళ్ళలో (Normal water ) + బెల్లం పొడి+ 4 or 5 సోంపు గింజలను కలిపి త్రాగండి.
( ఈ పానీయం బ్రేక్ ఫాష్ట్ తర్వాత లేక భోజనం తర్వాత త్రాగవలెను )

పై వాటిలో ఏదో ఒకటి ప్రతి రోజు త్రాగండి.

గమనిక ...
# రాగి మాల్ట్ తో జావని త్రాగండి.

# రాగి పిండితో సంగటి , రొట్టె , పాయసం , లడ్లు , బర్పీ , దోశ మొదలగు పదార్ధాలను కూడా తీసుకొండి. బలవర్ధకమైన ఆరోగ్యకరమైన ఆహారము.

# వారములో ఒక రోజు జొన్న రొట్టేతో బెల్లం ని కలిపి తినండి. *పిల్లలకు ఖచ్చితంగా తినిపించండి .

# రాత్రి జొన్న రొట్టె ముక్కలను మజ్జిగలో నానబెట్టండి .ఉదయం బ్రేక్ ఫాష్ట్ లాగా తినండి.

# బెల్లంతో చేసిన పదార్ధాలు తినండి . బెల్లంతో చేసిన వేరు శెనగ , నువ్వుల లడ్లు .

# Avoid Maida . Bakery items. ( Harmful food ).

# *పాలు + బెల్లం* కలప రాదు . బెల్లం బదులు  Sugar ( Chemical Free ) ని వాడండి .

# పిల్లలకు స్వదేశి ఆవు *వెన్న* కు మించిన *TONIC* లేదు . కావున మీకు లభ్యమైన యెడల *వెన్న*ని తినిపించండి .

# *Use only organic Jaggery ( బెల్లం.)*

# Avoid Multi grain Malts.

   *శ్రీ రాజీవ్ దీక్షిత్*


No comments: