Saturday, March 4, 2017

నిద్ర రావడం లేదా sleeplessness

   
*నిద్ర రావడం లేదా* 
----------------------


         మానసిక అశాంతి వలన నిద్ర రాదు . అధికంగా అలసి పోవడం , సరైన విధంగా ఆహారం తీసుకోక పోవడం , మలబద్ధకం , మానసిక అలసట, ఎక్కవగా చింతించడం , అనారోగ్యం మొదలగు కారణాల వలన కూడా రాత్రి సరిగ్గా నిద్రరాదు . అధిక ధూమ పానం , అధిక మధ్య పానం సేవించడం వలన నిద్ర రాదు . కొద్ది పాటి శబ్దానికే నిద్రలో మెలకవ వస్తుంది . కావున శరీరం త్వరగా అలసి పోవడం , బద్ధకంగా వుంటుంది . 

*గృహ చికిత్సలు : -----*

1. *రాత్రి పడుకునే ముందు : ---*            వేడి నీళ్ళతో కాళ్ళు , చేతులను శుభ్రంగా కడగ వలెను . పాదాలకు ఆవాల నూనె ( Mustard oil ) తో మాలిష్ ( మర్ధన ) చేయ వలెను . సుఖమైన నిద్రను పొందండి . 

2 . *ఆవాల నూనె లో*  + *పచ్చ కర్పూరంను*  కలిపి తలకు మర్ధన చేయాలి . 

3 . 2  Table Spoon ల *తేనె*  + 1 Spoon *ఉల్లి పాయ ( onion ) రసం*  కలిపి తీసుకొన వలెను . 

4 . *బొప్పాయి కూర* లేక *బొప్పాయి పండ్ల* ను తినండి . 

5 . *ఉసరి కాయ రసం*  + *జాజికాయ చూర్ణం*  కలిపి తీసుకొన వలెను . 

6 . కొద్ది నీళ్ళలో *జాజికాయ* ను రుద్ది ( బండ పైన నూరండి ) ఆ  రసంను  కను రెప్పల పైన పూయండి . *మంచి నిద్ర వస్తుంది* . 

7 . *తేనె* + *జాజికాయ చూర్ణం*  లను కలిపి తీసుకొండి . 
( అలసట , Irritation తగ్గి పోవును ) . 

8 . రాత్రి పడుకునే ముందు *తాజా గోరింటాకల* పేష్ట్ ను పాదాలకు పట్టించండి . 

9 . *పెరుగు ( లేక ) మజ్జిగ* + *నల్ల ఉప్పు* + *సోంపు*+ *మిరియాల పొడి* + *పటిక బెల్లం* కలిపి త్రాగండి . 

10 . రాత్రి భోజనం త్వరగా చేయండి . తక్కువగా తినండి . ఉదయం శారీరక శ్రమ చేయ వలెను . 

11 . రాత్రి భోజనం తర్వాత కొద్ది సేపు నడవ వలెను . 

    పై విధానాలలో ఏదో ఒక పద్దతిని ఆచరించి  , సుఖంగా నిద్ర పోండి . 

      *----- శ్రీ రాజీవ్ దీక్షిత్*


No comments: