Saturday, April 8, 2017

మనం వాడే ఉప్పు

*మనం వాడే ఉప్పు*
*************

*ఉప్పు*
              మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర . మన శరీరంలో జరిగే రసాయనక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి
జీర్ణ వ్వవస్ధకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి . జాతీయ పోషకహార సంస్ధ సిఫార్సు ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకి 6 గ్రాముల కన్నా ఎక్కవ ఉప్పు తీసుకోకూడదు . కాని ప్రతి రౌజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు . ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు . హై బీ.పి. చక్కెర వ్యాధులు , రక్త దోషాలు , గుండె పోటు , తలనొప్పి , ఛాతి నొప్పి మొదలగు వ్యాధులు వస్తాయి .
*సముద్రపు ఉప్పు ( Sea Salt )*
       1930 కి ముందు ఉత్తర భారతీయులందరు సైంధవ లవణాన్నే వాడే వారు . ఆంగ్లేయులు దీన్ని నిషేధించి సముద్రపు ఉప్పును ప్రవేశ పెట్టినారు . ఈ ఉప్పును తయారు చేయడానికి చాలా హానికరమైన రసాయనాలను కలుపుతారు . దీనిని ప్రాసెస్ చేసే ప్రక్రియలో 1200* పై వేడి చేయబడును . అందుచేత ఇది ఫ్రీఫ్లోగా వుండి జారి పోతుంది . సాధారణ ఉప్పులో 97.5 % సోడియం క్లోరైడ్ , 25% రసాయనాలతో కూడిన ఐయోడిన్ , పోటాషియం , అయోడైడ్ , సోడియం బయోకార్బోనేట్ , అల్యూమినియం , లవణం , సోడియం మోనో గ్లుటోమెట్ లు వున్నాయి .
     ఈ ఉప్పును నిత్యం వంటల్లో వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు.
# పెరుగులో జీవామృత కీటకాలు ఉంటాయి . అవి శరీరానికి చాలా ఉపయోగము . ఉప్పును పెరుగుతో కలిపి తింటే 20 రకాల జబ్బులకు గురి అవుతారు .
# ఈ ఉప్పును వాడటం వల్ల వాత, పిత్త , కఫ దోశాలు కలుగును .
# ఈ ఉప్పును ఆయుర్వేద మందులలో వాడదగినది కాదు .
# సముద్రంలో అనేక రకాల జీవరాసులు సముద్రంలోనే జీవిస్తూ , అందులోనే చనిపోవడం వల్ల వాటి అవశేషాలు అందులోనే కలిసి పోవడం వల్ల ఇది శాఖాహారం కాదు .
# ప్రాసెస్ చేసిన ఉప్పును , అయోడిన్ ఉప్పును వాడరాదు .
# అయోడిన్ ఉప్పుని వాడిన యెడల శృంగార సామర్ద్యం ఖచ్చితంగా తగ్గి పోతుంది .

*సైంధవ లవణం*
( Rock Salt ) .

# మనకు ప్రకృతి ప్రసాదించినది , లక్షలాది సంవత్సరాల పురాతనమైనది . స్వచ్చమైనది , ఏ మాత్రం కాలుష్యం సోకనిది ఈ *సైంధవ లవణం* .
# 100% *శాఖాహారం* , తక్కువ సోడియం మోతాదు కలది .
# *ఖనిజాలు* అత్యధికంగా కలిగినది .
# మన శరీరానికి కావలసిన పోషక విలువలు కలిగినది .
# *కాల్షియం , కాపర్, ఐరన్, మెగ్నీషియం , పాస్ఫరస్ , పొటాషియం , సిలికాన్ , సల్ఫర్ , జింక్ , అయోడిన్ , ఆక్సిజన్* , మొదలగు పోషక విలువలు కలవు .
# కణం స్ధాయిలో దేహము యొక్క శక్తిని పెంపొందించును .
# సుఖ నిద్రకు సహాయకారి .
# ఎముకల దృడత్వాన్ని పరి రక్షిస్తుంది .
# ఆస్తమా , సైనసైటిస్ ను అదుపు చేస్తుంది .
# శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది .
# అధిక బరువును నియంత్రించటంలో సహాయకారి .
# మలబద్ధకాన్ని పోగొట్టును .
# గ్యాస్టిక్ ను తగ్గిస్తుంది .
# కాలేయంలోని వేడిని నియంత్రించును .
# వాయు సంభందిత వ్యాధులకు ఉపశమనం .

        ఈ *హిమాలయన్ రాక్ సాల్ట్* రాళ్ళు *ఎరుపు , గులాబి మరియు తెలుపు* రంగుల్లో లభించును . ఉ ఉప్పును ఎందులో వేసినా ఆ పదార్ధం యొక్క రుచి మరింతగా పెరుగుతుంది . సైంధవ లవణం వ్రతాలలోను , పూజలలోను , ఉపవాసాల్లోను వాడుతారు . ఈ ఉప్పును నిత్యం వంటల్లో వాడినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు .
# కూరగాయలను సైంధవలవణం కలిపిన నీటితో కడిగితే , పెస్టిసైడ్స్ యొక్క దుష్పలితాలను కొంత వరకు నివారించ వచ్చును .
# *ఆయుర్వేద మందులలో ఈ సైంధవలవణంని వాడవలెను*.
# నిత్యం ఈ సైంధవలవణం వాడే వారికి వాత , పిత్త , కఫాలు సమంగా ఉండును .
# ధైరాయిడ్ , బీ.పి. , పక్షపాతం , చక్కెర వ్యాధి , కీళ్ళ సమస్యలు మొదలగునవి రావు .
# పెరుగులో సైంధవ లవణం కలిపి తింటే జీవితాంతం ఆరోగ్యంగా వుంటారు .

  *సైంధవ లవణం ( Rock Salt )* ని వాడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి .

*గమనిక :--  వంటల్లో సైంధవలవణం మరియు నల్ల ఉప్పు వాడవచ్చును* .

*---- శ్రీ రాజీవ్ దీక్షిత్*.

No comments: