Saturday, April 8, 2017

మనం మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా , ఏ విధముగా త్రాగాలి ?*

*మనం మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా , ఏ విధముగా త్రాగాలి ?*
*******************************************

    అన్ని రోగాలకి చికిత్సకంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు .

    *"భోజనాంతే విషం వారీ"* , అంటే భోజనం చివర నీరు త్రాగటం *"విషం"*తో సమానం . మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది . అక్కడ అగ్ని *( జఠరాగ్ని )* ప్రదీప్తమవుతుంది . ఆ *అగ్ని* తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది . ఇది ప్రధానమైన విషయం .

    భోజనం తిన్న తరువాత నీళ్ళు త్రాగితే *జఠరాగ్ని* చల్లబడుతుంది . ఇక తిన్న ఆహారము అరగదు . అది *కుళ్ళి* పోతుంది . కుళ్ళిన ఆహారం నుండి వచ్చిన *విషయవాయువులు* శరీరమంతటా వ్యాపిస్తాయి . ఆ విషయవాయువుల వలన 103 రోగాలు వస్తాయి . ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల , ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు.

*నీరు త్రాగే విధానం* :--
  నీటిని గుటక గుటకగా త్రాగాలి . ఒక్కొక్క గుటక నోటిలో నింపుకంటూ చప్పరిస్తూ త్రాగాలి . వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి . నీరు ఎపుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి . ఇది నీరు త్రాగే సరైన విధానం . *గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు.*

*ఫలితము* :---
    నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది . పొట్టలో *ఆమ్లాలు* తయారవుతాయి . లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి *న్యూట్రల్* అవుతుంది . అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి . అపుడు మనం *జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును.*

*ఎప్పుడు త్రాగాలి* : ----
 బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి .
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంట న్నర తరువాత త్రాగాలి . *(ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది)*. అపుడు ఆహారం సక్రమంగా *జీర్ణమవుతుంది‌* .

భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును . భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము , గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును .
# ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తరువాత *పండ్లరసాలు* త్రాగవచ్ఛును .
# మధ్యాహ్న భోజనం తరువాత *మజ్జిగ* త్రాగవచ్చును .
# రాత్రి భోజనాంతరము *పాలు* త్రాగవచ్చు .

      ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు . ఎందుకంటే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి .

*నీరు ఎంత త్రాగాలి* : --
    మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి . ఉదా: మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది . దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది.  మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను .

*ఎలా త్రాగాలి :--*
# ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి .
# నిలబడి నీళ్ళు త్రాగరాదు .
# చల్లని నీళ్ళు ( Cool Water)  త్రాగరాదు .
# గోరు వెచ్చని నీళ్ళు త్రాగవలెను .
# ఎండాకాలములో ( మార్చి నుండి జూన్) మట్టికుండలోని నీరు త్రాగవలెను .

*మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు.
* మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు .
* స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు.

మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన మూత్ర సంబంధ  వ్యాధులు వస్తాయి .
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది .
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి .
ఎండ నుండి నీడకు వచ్చి వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి .
రిఫ్రిజిరేటర్ నీళ్ళు చాలా హానికరము .

    మనకు ఆహారము ఎంత ప్రధానమో , తిన్న ఆహారము సక్రమంగా జీర్ణమటం అంతే ప్రధానము .

   మనము తిన్న భోజనము జీర్ణము కాని యెడల అది కుళ్ళిపోతుంది . ఆ కుళ్ళిన ఆహారము వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది . మొట్టమొదట గ్యాస్ ట్రబుల్ ,  గొంతులో మంట , గుండెలో మంట , ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ , అల్సర్ , పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి . చివరగా క్యాన్సర్.

      మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగిన యెడల , మీరు జీవితంలో *ఏ రోగాల బారిన బడరు . సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారు .*
  *ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది.*

      *శ్రీ రాజీవ్ దీక్షిత్*.

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: