Saturday, May 13, 2017

జై గోమాత ..... జైజై విశ్వ మాత -1

జై గోమాత ..... జైజై విశ్వ మాత  ( 1 )

      మాత , భూమాత , గోమాత కలిసినదే  " వందేమాతరం ". మాతృమూర్తి విలువ తెలియకున్నా కన్నందుకు ఏదో గౌరవిస్తూన్నాం. భూమాత వైభవం తెలియకున్నా అవసరం వుంది కాబట్టి దేశభక్తి నటిస్తున్నాం. ఇక గోమాత విషయానికి వస్తే దాని గురించి ఏనాడో మరచి పోయాం. అసలు గోవు అంటే ఏమిటి దానితో మనకి సంబంధం ఏమిటి ?  అమ్మ తర్వాత గోవును ఎందుకు అమ్మ అన్నారు. దేవతలందరూ గోవులోనే వుండటం ఏమిటి ? ఇవన్నీ తెలియకున్నా ఒక్క విషయం తెలియటం అవసరం. అది ఏమిటంటే మనిషి లేకుండా గోవు జీవించ గలదు , గోవు లేకుండా మనిషి జీవించలేడు. మనిషి మనుగడే అగమ్యగోచరం అవుతుంది.

      గోవులో 33 కోట్ల దేవతలు వున్నారు. మనం ఎక్కడైనా వెళుతున్నప్పుడు మనకు దారిలో ఆవు కనపడితే ఆవుపై నిమిరి ఆ చేతిని శిరస్సుకు హత్తుకుంటాం. మన దేశంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల్లో గోమాతను పూజించడం జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు , గోవత్స ద్వాదశిరోజు మరియు గోపాష్టమి రోజుల్లో గోమాత పూజ జరుగుతుంది. మనము ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా గోమాతను పూజించటం జరుగుతుంది. ఈ దేశం మాత్రమే గోవత్సము ( లేగ దూడ ) నుండి వచ్చే  " అమ్మా "  అనే మాటను మన మాటలలో చేర్చుకుంది. మనం కూడ మన తల్లిని అమ్మా అనే పిలుస్తాం.

      ఆవును అమ్మా గా భావించే మనం మన భక్తిని పూజకు పరిమితం చేశాం. బాధ్యతను విస్మరించాం. చంటి బిడ్డ తల్లిని వదిలేస్తే నష్టం ఎవరికి ? ఇప్పుడు మనకి కావలసినది గ్రుడ్డి భక్తి కాదు. శాస్త్రీయమైన జ్ఞానం. బలహీనతలకు లొంగని వైరాగ్యం.

      గోమాత మనల్ని ఎలా లాలించి , పాలించి పోషిస్తుందో , ఎంతటి భయంకరమైన ఆపదల నుంచి రక్షిస్తుందో
 తెలుసుకొనవలెను.

       మన శరీరతత్వాన్ని మనమే గుర్తించగలిగి మనలోని దోషాలను , రోగాలను త్యజింప చేసుకోగలిగే సామర్ధ్యాన్ని పొందవలెను.

      మన జీవితాలను మలుపు తిప్పే విలువైన , అరుదైన శ్రీ ఉత్తమ్ మహేశ్వరీ గారి ప్రవచనాలను తెలుసుకొని ఆరోగ్యాన్ని , ఔన్నత్యాన్ని పొందుదాం.

         " హరే కృష్ణ "


Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"

Vishnu@Goseva world


No comments: