Saturday, May 13, 2017

స్వచ్ఛమైన నెయ్యి గురించి...

జై గోమాత ..... జైజై విశ్వ మాత ( 2 )

స్వచ్ఛమైన నెయ్యి గురించి .....
-----------------------------___

      ప్రస్తుతం బజారులో నెయ్యి పేరుతో అమ్మడు పోతున్నది అసలు నెయ్యి కానే కాదు. పాల నుంచి క్రీమ్ను తీస్తారు. ఆ క్రీమ్ను బట్టర్ అంటాం. ఈ బట్టర్ నుంచి నెయ్యిని తీస్తారు. అది నెయ్యి కాదు , అది బట్టర్ ఆయిల్ మాత్రమే.

      మన యశోదమాత పెరుగు చిలికి తీసిన దానిని వెన్న అంటాం. పెరుగును చిలికితే అమృతం వంటి వెన్న. ఆ వెన్న నుండి వచ్చేది అసలు సిసలైన నెయ్యి. వెన్నలో వుండే గుణాలు బటర్లో లేవు. వెన్న తినవలసిన పదార్థం. మన పిల్లలకు వెన్న తినిపించినట్లయితే ప్రపంచంలో నేటి వరకు వెన్నను మించిన టానిక్ మరొకటి తయారు కాలేదు. వెన్నను తినడం వల్ల శరీరాలు ఆరోగ్యవంతముగా వుంటాయి. మస్తిష్కాలు కూడా సూక్ష్మంగా పనిచేయ గలుగుతాయి. బుద్ధి తీక్షణత , తేజస్సు పెరుగుతుంది. అవకాశం వుంటే పిల్లలకు వెన్న తినిపించండి. పిల్లలకు నెయ్యి కంటే కూడా వెన్న ఎక్కువ మేలు చేస్తుంది. పెద్దలకు నెయ్యి మంచిది.

      ప్రస్తుతం మన వాళ్ళు పాలనుంచి మీగడను వేరు చేసి ఫ్రిజ్ లో భద్రపరుస్తూ వుంటారు. అది ఎక్కువగా కూడ బెట్టిన తర్వాత ఒక రోజు దానిని తీసి పొయ్యిపై పెట్టి వేడిచేసి నెయ్యి తయారయ్యింది అంటాము. ఇది పొరపాటు మీరు పాలనుంచి క్రీమ్ ని తియ్యకండి. వెన్నతో పాటే పాలను తోడు పెట్టండి. పెరుగు నుండి తీసిన వెన్నను ఒక చోట పెట్టండి.

      వెన్నతో పాటే పాలను తోడు పెట్టండి. ఆ పెరుగును చిలకటం కూడా మిక్సీలో కాకుండా మీరు స్వయంగా చిలకండి. యశోద మాతను స్మృతిలో వుంచుకుంటే మీ చేత తయారు చేయబడిన ఆ వెన్న ప్రసాదమవుతుంది. అమృతము అవుతుంది.

      మనం తోడు పెట్టిన పెరుగును మిక్సీలో చేసినట్లయితే అక్కడ జరిగేది ఘర్షణ. అపుడు ఆ పదార్ధంలో వున్న శక్తి , అందులోని ప్రాణ శక్తి కూడా తొలగి పోతుంది. అందుకే మీరు పెరుగును చేతితో చిలికి వెన్నను తీసి కూడ బెట్టండి. తరువాత దానితో నెయ్యి తయారు చెయ్యండి. అప్పుడు ఆ వెన్న ప్రపంచంలోనే అత్యుత్తమైన టానిక్.

      పాల నుంచి తీసిన క్రీముతోను , మీగడతోనూ తయారు చెయ్యబడిన వెన్న + నెయ్యి హానికరం.

      దేశవాళీ ఆవు పాలు , పెరుగు , వెన్న , నెయ్యి మాత్రమే శ్రేష్టం. పైలక్షణాలన్ని దేశవాలి ఆవు పాలు , వెన్న , నెయ్యిలకు కలవు.

           " హరే కృష్ణ "

                   శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru







Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"

Vishnu@Goseva world


No comments: