Sunday, May 14, 2017

దేశీయ ఆవు పెరుగు గురించి ....

జై గోమాత ..... జైజై విశ్వమాత ( 7 )

దేశీయ ఆవు పెరుగు గురించి ....

       భారతదేశంలో నిర్లక్షరాస్యులైన సామాన్య మహిళలకు తెలుసు , గర్భిణీ స్త్రీలు వేడి చేసే పదార్థాలు తీసుకోకూడదు. స్త్రీలు గర్భం ధరించినపుడు బెల్లం , బొప్పాయి , పెరుగు తినవద్దు అంటారు. చాలా మంది అనుకుంటూ వుంటారు. పెరుగు చలువ చేస్తుంది అని , కాని వాస్తవానికి పెరుగు వేడి చేస్తుంది.  పెరుగు నుంచి చేసిన మజ్జిగ చలవ చేస్తుంది. వెన్న చలవ చేస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు వేడి చేసే వస్తువులను దూరంగా ఉంచాలి.

      గర్భిణీ స్త్రీలకు ఆవు పాలను వెండి పాత్రలో తోడు పెట్టి ఆ పెరుగుని తినిపించినట్లుయితే గర్భిణీ స్త్రీలకు ఎప్పుడూ మానసికంగా గానీ , శారీరకంగా గానీ వికలాంగులైన సంతానం కలుగనే కలుగదు. వెండి పాత్రలోని ఆవు పెరుగును తినడము వలన పుట్టే పిల్లలు మేధావులై , శక్తిమంతులై వుంటారు. ఇది ఆవు పాలతో చేసిన పెరుగుకు ఉన్న విశిష్టత . వెండి పాత్ర ఎల్లప్పుడూ చలువ చేస్తుంది.

           " హరే కృష్ణ "

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

No comments: