Sunday, May 14, 2017

గోమయం గురించి ...

జై గోమాత ...... జైజై విశ్వమాత ( 10 )

గోమయం గురించి ......

      " గోమయే వసతే లక్ష్మీ " అంటే ఆవు పేడలో లక్ష్మీ దేవి నివసిస్తుంది. ఆవు పేడలో ఉన్నది అద్భుతమైన శక్తి. అందుకే మన శాస్త్రలలో గోమయంలో లక్ష్మీ దేవి ఉంటుంది అని చెప్పినారు. ఆవు ప్రసాదించే ఉత్కుష్ఠమైన పదార్థం గోమయం. మనం కేవలం ఆవు పేడను పూజా కార్యాలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే వంటగదిలో , ఇంటి ముందు కళ్ళాపిగా చల్లుతూ ఉంటాం. యజ్ఞ కార్యాలలో కూడా హవనంలో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ఆవు పేడ యొక్క వైశిష్ట్యం.

      ఆవు పుట్టిన మొదటిరోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగదూడ మొదటి సారి వేసిన పేడ చాలా విశిష్టమైనది , అత్యుత్తమమైనది. కాని ఈ పేడ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఆ పేడ వెయ్యగానే ఆవుయే దానిని తినివేస్తుంది. ఈ పేడ బ్లడ్ క్యాన్సర్ కు అత్యుత్తమమైన ఔషధం.

     ఎవరికైన పడక కురుపులు వున్న యెడల , వారు పేడను కాల్చగా వచ్చిన భస్మాన్ని ఆ పుండుకు పట్టించండి. కేవలం ఒక్క నెలలో పూర్తిగా నయమయిపోతుంది.

      మీరు నిరంతరం ఆవు పేడతో తయారైన అగర్ బత్తులను వాడండి. ఆ అగర్ బత్తుల భస్మం అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. పిల్లలు ఆటపాటల్లో ఏవైన దెబ్బలు తగిలించుకుంటే , ఆ భస్మాన్ని దెబ్బలు ఉన్న చోట పూయండి. త్వరగా తగ్గిపోతాయి.  దెబ్బలు తొందరగా తగ్గన్ని మధుమేహ వ్యాధిగ్రస్ధులు కూడా ఈ భస్మాన్ని ఉపయోగించిన యెడల తొందరగా దెబ్బలు , పుండ్లు తగ్గిపోతాయి. ఏవైన విషపు క్రిములు కుట్టినా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది.

     ఆవు పేడలో చేసిన అగరు వొత్తులు వెలిగించటం వల్ల , ఆ ధూపం ఇంట్లో మూలమూలకు వ్యాపించి పవిత్రతను చేకూరుస్తుంది. అటువంటి ఇంట్లో దారిద్ర్యం నిలువదు. అందుకే ఆ అగరు వొత్తులను వెలిగించండి.

      గోమాత మహిమను వర్ణించడం ఎవరి వల్ల కాదు.

          " హరే కృష్ణ "
 
                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

No comments: