Saturday, May 13, 2017

దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు .... సంపూర్ణ ఆరోగ్యం.

జై గోమాత ...... జైజై విశ్వమాత (4 )

దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు .... సంపూర్ణ ఆరోగ్యం.

       గోమాత మహిమ ఏమిటి ? మనిషికి ఎవరి మహిమ అయినా ఎప్పుడు అవగతమవుతుంది , అది తనస్వార్ధాన్ని  నెరవేర్చినపుడి అందులోని మహత్యం మనకి అర్ధమవుతుంది. ఈ రోజు అనారోగ్యం ఒక పెద్ధ సమస్య లక్షల రూపాయలు వెచ్చిస్తూ వున్నా ఆరోగ్యం మాత్రం అందడం లేదు. మనకు గోమాత కృపవల్ల ఎంతో తేలికగా , సులభంగా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

         దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు ప్రతి రోజు పడుకునేటప్పుడు రెండు ముక్కులలో రెండు రెండు చుక్కలు వేయుటవలన , కాలర్ బోన్కు పై భాగంలో ఏ ఆరోగ్య సమస్య వున్నా తగ్గిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం ఖచ్చితంగా చేకూరును.

      స్త్రీలు , పురుషులు , పిల్లలు , వృద్ధులు ఎవరైనసరే ఈ క్రింది అనారోగ్య సమస్యలతో వున్న వారు ఆవు నెయ్యి చుక్కలు వేసుకొని కొద్ది రోజులలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

అనారోగ్య సమస్యలు : -

       పక్షవాతం , చెవి పొర చిధ్రమైన వారు , మెదడులో క్లాట్స్ , కణతలు , ముక్కు వాసనలు గుర్తించక పోవడం , కోమాలో ఉన్నా , తలనొప్పి , పార్శ్వపు నొప్పి ( మైగ్రేయిన్ ), చికాకుపడడం , రాత్రి పూట నిద్ర రానివారు ,  సైనసైటిస్ , ఆగకుండా తుమ్మలు రావడం , స్మరణ శక్తి బలహీనంగా వున్నవారు , అలర్జిక్ ఆస్తమా , మతి మరపు ఎక్కువగా ఉన్నవారు , ఎవ్వరినీ  గుర్తు పట్టలేనంత మానసిక స్ధితిలో వున్నవారు , మెమరీలాస్ , జుట్టు రాలడం , బట్టతల , ఫ్రోజన్ షోల్డర్ , కంటిలో మంట వున్నవారు , చెవిలో చీము కారుతున్న , టెన్షన్ , పిల్లలు హైపర్ యాక్టివ్ గా వున్న వారు.

     పై అనారోగ్య సమస్యలు వున్న వారు నెయ్యి చుక్కలు వేసుకొండి.

      దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు ప్రతి రోజూ రాత్రి పడుకునేటప్పుడు రెండు ముక్కులలో రెండు రెండు చుక్కలు చొప్పున వేసుకొనవలెను. తలక్రింద దిండు తీసి వేయాలి. ఆ తర్వాత నెయ్యి చుక్కలు వేసుకోవాలి. వెంటనే నీళ్ళు త్రాగరాదు. ఐదు లేక పది నిమిషాలు ప్రశాంతంగా , మౌనంగా ఉండి పోవాలి. ముక్కులో ఈ ఆవు నెయ్యి చుక్కలు వేసుకున్న తర్వాత పీల్చు కొనకూడదు. పీల్చుకొనిన యెడల అది ముందుకు వెళ్ళి పోతుంది. దాని పాత్రను అది నిర్వర్తించలేదు. అలా ముక్కులోనే ఉండి నెమ్మది నెమ్మదిగా రాత్రంతా మీరు నిద్ర పోయినా , ఆవు నెయ్యిలో వున్న ప్రాణశక్తి మీ ఆజ్ఞా చక్రం జాగృత మౌతుంది. జాగృతమైన ఆజ్ఞా చక్రం మరలా శరీర క్రియలను సక్రమంగా నియంత్రించ గలుగుతుంది. అపుడు మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరు.

      దేశవాళీ ఆవు నెయ్యికి మాత్రమే ఈ అద్భుతమైన శక్తి కలదు.

          " హరే కృష్ణ "
           

      ... శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru







Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"

Vishnu@Goseva world

No comments: