Saturday, May 13, 2017

కౌ ధెరపీలో దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు ......

జై గోమాత .... జైజై విశ్వమాత (3)

కౌ ధెరపీలో దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు ......

      దేశవాళీ ఆవు నెయ్యి చుక్కలు ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు రెండు ముక్కలలో రెండు రెండు చుక్కలు చొప్పున వేసుకొనవలెను.  తలక్రింద దిండు తీసివేయాలి. ఆ తర్వాత నేతి చుక్కలు వేసుకోవాలి. వెంటనే నీళ్ళు త్రాగకుడదు. ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా , మౌనంగా ఉండి పోవాలి. ముక్కలో ఈ ఆవు నెయ్యి చుక్కలు వేసుకున్న తర్వాత లోపలికి పీల్చుకోకూడదు. పీల్చుకుంటే అది ముందుకు వెళ్ళి పోతుంది. దాని పాత్రను అది నిర్వర్తించలేదు. అలా ముక్కలోనే ఉండి నెమ్మది నెమ్మదిగా రాత్రంతా మీరు నిద్ర పోయినా రాత్రంతా మీ ప్రాణ శక్తి మీ ఆజ్ఞా చక్రానికే అందుతుంది.

      మీ భ్రుకుటిన నడుమ రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది. అది శరీరంలోని క్రియలన్నింటినీ ఆజ్ఞాపిస్తుంది. ఈ ఆజ్ఞా చక్రం జాగృత మౌతుంది. దానిలోకి ప్రాణం ప్రవేశిస్తుంది. ఈ ఆజ్ఞా చక్రంలో ప్రాణం తగ్గటం వల్లనే శరీరంలోని వివిధ క్రియలను అది సక్రమంగా నియంత్రించలేక పోతుంది. అందులోకి ప్రాణ శక్తి చేరడం వలన అది మరలా శరీరక్రియలను సక్రమంగా నియంత్రించ గలుగుతుంది. ఈ విధంగా ఈ ఆజ్ఞాచక్రం జాగృతమవుతుంది.

      ఒక మాటలో చెప్పాలంటే కాలర్ బోన్ కు పై భాగంలో ఏ సమస్యవున్నా ముక్కులో  దేశవాళి ఆవునెయ్యి చుక్కలు వేయుట వలన ఎంతో అద్భుతమైన పరిణాములు వుంటాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పొంద గలరు.

            " హరే కృష్ణ "

            శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.


Collected and typed by: Ram Prasad Gaaru







Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"

Vishnu@Goseva world

No comments: