Sunday, May 14, 2017

దేశీయ ఆవు వెన్న గురించి .....

జై గోమాత ....... జైజై విశ్వమాత ( 9 )

దేశీయ ఆవు వెన్న గురించి .....

     ఆవు వెన్న ఎంతో శ్రేష్ఠమైనది , చలువ చేస్తుంది.

      ప్రస్తుతం చాలా మంది పాల నుంచి క్రీమ్ ను తీస్తారు. ఆ క్రీమ్ ను బట్టర్ అంటాం. ఈ బట్టర్ నుంచి నెయ్యి ని తీస్తారు. అది
నెయ్యి కానేకాదు. అది బట్టర్ ఆయిల్ మాత్రమే.

      మీరు పాల నుంచి క్రీమ్ ను తీయకండి. వెన్నతో పాటే పాలను తోడు పెట్టండి. ఆ పెరుగును మిక్సీలో కాకుండా మీరు స్వయంగా చేతితో చిలకండి. యశోద మాతను స్మృతి లో వుంచుకుంటే మీ చేత తయారు చేయబడిన ఆ వెన్న ప్రసాదమవుతుంది. అమృతం అవుతుంది.

      వెన్న తినవలసిన పదార్థం. మన పిల్లలకు వెన్నను తినిపించినట్లుయితే ప్రపంచంలో నేటి వరకు వెన్నను మించిన టానిక్ మరొకటి తయారు కాలేదు.

       వెన్నను తినడం వల్ల శరీరాలు ఆరోగ్యవంతముగా వుంటాయి. మస్తిష్కాలు కూడా సూక్షంగా పని చేయ గలుగుతాయి. బుద్ధి , తీక్షణత , తేజస్సు పెరుగుతుంది.

      పిల్లలకు నెయ్యి కంటే కూడా వెన్న మేలు చేస్తుంది. పెద్దలకు నెయ్యి మంచిది. అందుకే శ్రీ కృష్ణ భగవానుడు గోపబాలురకు వెన్న ముద్దలు తినిపించాడు.

       ' హరే కృష్ణ '

                     శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: