Monday, June 5, 2017

10.త్రిఫల చూర్ణం గురించి .....మన ఆరోగ్యం ..

మన ఆరోగ్యం .... మనచేతుల్లో

త్రిఫల చూర్ణం గురించి ......

       వాతము , పిత్తము , కఫము ఈ మూడింటినీ శమింపచేసే వస్తువులు చాలా తక్కువ. వీటిలో మొదటిది ఉసరి , రెండవది కరక్కాయ , మూడవది తానెకాయ , ఈ మూడు కలిస్తే తయారవుతుంది " త్రిఫల". త్రిఫల గురించి ఒక మోతాదును తెలియజేశారు వాగ్భటాచార్యులు.  ఎంతో మంది త్రిఫలను సమపాళ్ళలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ప్రయోజనం కాదు. త్రిఫలను గురించి సూచించిన మోతాదు చుస్తే మొదట కరక్కాయ 1 పాళ్ళలోనూ , రెండవది తానెకాయ 2 పాళ్ళలోను , మూడవది ఉసరికాయ 3 పాళ్ళు ఉండేలాగా చూసుకోవలెను. ఇది వాత , పిత్థ , కఫాలని శమింపచేయటానికి అద్భుతమైనది.

       ప్రత్యేకమైన రోగాలకు మాత్రమే త్రిఫల సమపాళ్ళలో తీసుకోవలసి వస్తుంది.

     ఉదయం పూట త్రిఫల తీసుకునే వాళ్ళు బెల్లంతో కలిపి తీసుకోవాలి లేదా తేనెతోటి తీసుకోవాలి. రాత్రి పూట త్రిఫల తీసుకునేవారు పాలతోటి లేదా వేడినీళ్ళలో త్రిఫల  తీసుకుంటే అది రేచకంగా పనిచేస్తుంది. అంటే
కడుపును శుభ్రం చేస్తుంది. పెద్ద పేగును , ఇలా శరీరంలోని అన్ని అవయవాలని శుభ్రం చేస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. ఎంతోకాలంగా ఉన్న మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

       ఉదయంపూట బెల్లంతోగానీ , తేనెతోగాని త్రిఫల తీసుకుంటే అది పోషకంగా పనిచేస్తుంది. మన శరీరానికి ప్రతి రోజు కావలసిన విటమిన్స్ సి. ఎ. డి. కె , మైక్రోన్యూట్రియన్స్ ని , కాల్షియం , ఐరన్ , ఇలా అన్ని రకాల పోషకాలు శరీరానికి అందాలంటే ఉదయంపూట త్రిఫలాన్ని బెల్లంతో తీసుకోవాలి.

      మలబద్ధకం పోవాలన్నా ఇంకేదైనా సమస్యలు పోవాలంటే త్రిఫల రాత్రి పూట తీసుకోండి. ఆరోగ్యవంతులైతే ఉదయం పూట త్రిఫల తీసుకోండి.

      అధిక బరువు తగ్గాలనుకునేవారు ఒక పెద్ద స్పూను అంత త్రిఫల , ఉదయం పూట పరిగడుపున బెల్లం తో కలిపి ఉండేలాగా చేసుకుని తిని తర్వాత పాలు త్రాగండి. కడుపును శుభ్రం చేసుకునే వారైతే రాత్రి పూట త్రిఫల చిన్న స్పూను అంత వాడు కోవాలి.

       ఉదయం తీసుకునేవారు అల్పాహారానికి ముందు 45 నిమిషాల ముందే త్రిఫల చూర్ణం తీసుకోవాలి.

      మూల రోగము , భగందరరోగము కడుపుకు సంబంధించిన రోగములు నయం చేసుకోవాలంటే రాత్రి పూట భోజనం చేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు పాలతోగానీ వేడినీళ్ళతో గానీ తీసుకోవాలి.

      నిరాటంకంగా 3 నెలలు త్రిఫల తీసుకుంటే 15 - 20 రోజులు ఆపి ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవాలి.

     " ఆరోగ్యమే ... మహాభాగ్యం. "

          శ్రీ రాజీవీ దీక్షిత్...


Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world

No comments: