Monday, June 5, 2017

11.గోమయంతో చేసిన పళ్ళ పొడి గురించి....

జై గోమాత .... జైజై విశ్వ మాత ( 11 )

గోమయంతో చేసిన పళ్ళ  పొడి  గురించి....

      ఆవు పేడతో పళ్ళపొడి తయారు అవుతుంది. పేడతో బొగ్గు తయారు చేసి , ఆ తరువాత పళ్ళపొడి చేస్తారు.

        ఈ పళ్ళ పొడిని ఉపయోగించిన యెడల పళ్ళు బాగా పటిష్టంగా వుంటాయి. అందుకే బలహీనమైన పళ్ళు ఉన్నవారు ఈ పళ్ళ పొడిని ఉపయోగించాలి. పంటి నొప్పితో బాధపడేవారు ఈ పళ్ళ పాడిన ఉపయోగిస్తే కేవలం కొద్దిరోజులలోనే వారి నొప్పి మటు మాయం అవుతుంది.

      పళ్ళ పాడిని మీరు నోటిలో నింపి ఉంచి 5 నిమిషాల తర్వాత వేలితో రుద్దాలి చిగుళ్ళను , దంతాలను కాదు. మనము చిగుళ్ళను బాగా మాలిష్ చెయ్యడం వల్ల అవి బలిష్టంగా తయారు అవుతాయి. అపుడు దంతాల సమస్య ఉండదు. ఎందుకంటే దంతాలు ఎలాగూ పటిష్టంగానే ఉంటాయి. మీ చిగుళ్ళు బలహీనమైనప్పుడే మీ దంతాలు చెడిపోతాయి. కనుక మీరు తోమవలసినది చిగుళ్ళనే. చిగుళ్ళను తోమే క్రమంలో వాటితో పాటు దంతాలు ఎలాగూ తోమబడతాయి.

      ప్రస్తుతం మనము మన దంతాలను బ్రష్ తో తోముతున్నాము. బ్రష్ చేసే పని కేవలం పళ్ళ మధ్యలో ఇరుకున్న పదార్ధాలను బయటకు తియ్యటం. ఆ పనికి పట్టేది 15 - 20 సెకన్లు మాత్రమే , కాని మనము ఎంతోసేపు తోముతున్నాం. టూత్ బ్రష్ తో ఎక్కువ సేపు పండ్లు తోమడము వలన చిగుర్లు దెబ్బతిని , పండ్లు చాలా తొందరగా వూడి పోవడానికి అవకాశం కలదు. ఈ టూత్ బ్రష్ పూర్తిగా అన్ సైంటిఫిక్ అయినది. ఈ టూత్ బ్రష్ తో బ్రష్ చేయడం పూర్తిగా అశాస్త్రీయన పద్ధతి. మనం ఈ టూత్ బ్రష్ ని 24 గంటలు బాత్రూంలో ఉంచుతాం. అందువలన దానిపై బ్యాక్టీరియా మరియు వైరస్ నిలువ ఉంటాయి. అటువంటి దానిని మన నోట్లో వేసుకుని మననోటి దుర్వాసన పోతుంది అని అంటాం. ఇది ఎక్కడి సైన్సు మీరే అర్ధం చేసుకోండి. అన్నిటికన్నా సైంటిఫిక్ వేలితోటి తోమడం వల్ల మీ చిగుళ్ళు బాగా బలిష్టంగా తయారు అవుతాయి.

      బొగ్గు అన్ని రకాల క్రిములను సంహరిస్తుంది , మాలిన్యాన్ని పీల్చుకుంటుంది.  ఒక వేళ మీరు సక్రమంగా శుభ్రం చెయ్యలేకపోవటం జరిగినా అది మీ పళ్ళలో ఉండి పోయినాకూడా ఆ బొగ్గు మీ పళ్ళకు మేలే చేస్తుంది తప్ప కీడు చెయ్యదు. అందుకు ఈ పళ్ళ పొడి ప్రపంచములోనే ఉత్క్రష్టమైన శాస్త్రీయ మైన పళ్ళపొడి , మీరు దానిని ఉపయోగించండి.

      మనం ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మాలిన్యం నాలుక మీద , కంఠంలో కూడా ఉంటుంది. అందుకే మీరు పళ్ళు తోముకునేటప్పుడు వేలితో నాలుకను శబ్దం చేస్తూ  ఆ ..... అని శబ్దం చేస్తూ నాలుకపై వేళ్ళతో రుద్దాలి. అలా చెయ్యటం వల్ల మీ కంఠం పూర్తిగా శుభ్రమవుతుంది. అపుడు మీ స్వరం ఎంతో మధురంగా వుండును.

      ఈ విధంగా నాలుక లోపలికి వేళ్ళు పెట్టి రుద్దడం వలన కంటి నుంచి , ముక్కులో నుండి నీళ్ళు కారతాయి. ఈ విధంగా మీ కళ్ళు , ముక్కు పూర్తిగా శుభ్రమవుతాయి. ఇలా చేయడం వలన త్రోట్ ఇన్ ఫెక్షన్ రాదు , సైనస్ ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. నత్తి ఉన్నవారికి 3 నుండి 6 నెలల్లో పూర్తిగా పోతుంది. నత్తి ఉన్నవారు స్వేచ్ఛగా , ఉత్సాహంగా సంకీర్తనలు పాడండి. అలా ఎక్కువగా పాటలు పాడటం వల్ల నాలిక మర్దన చెయ్యబడి , వారికున్న నత్తి తగ్గిపోతుంది.

      ఆవు గోమయంతో చేసిన పళ్ళపొడి వాడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

       " హరే కృష్ణ "

                 శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: