Monday, June 5, 2017

12.సైంధవలవణం .( ఉప్పు )..మన ఆరోగ్యం

🌸 మన ఆరోగ్యం ..... మనచేతుల్లో 🌸
 🏔 సైంధవలవణం .( ఉప్పు )
    Rock Salt ( Purest cooking salt on the Earth )

    సైంధవలవణం (ఉప్పు ) ప్రకృతి ప్రసాదించినది. భూమి పై అన్నిటికంటె స్వచ్ఛమైన ఉప్పు , మన శరీరానికి కావలసిన 84 రకాల పోషక విలువలు కలిగినది. ఈ ఉప్పు నిత్యం వంటల్లో వాడిన వారికి పలు వ్యాధుల నుండి ఉపశమనం లభించును. 100 %  శాకాహారం, తక్కువ సోడియం మోతాదు కలది. దీర్ఘకాలం నిలువ చేయగలగినది. కణము స్ధాయిలో దేహము యొక్క శక్తిని పెంపొందించునది.
     సుఖనిద్రకు సహాయకారి ,ఆస్తమా , సైనసైటిస్ లను ఆదుపు చేస్తుంది. శ్వాసక్రియను మెరుగు పరుస్తుంది. ఎముకల ధృడత్వాన్ని పరిరక్షిస్తుంది.

      ఈ హిమాలయన్ రాక్ సాల్ట్ ఎలాంటి కాలుష్యం సోకనిది. ఈ ఉప్పు రాళ్ళు , ఎరుపు , గులాబి , తెలుపు రంగుల్లో లభించును. ఖనిజాలు అత్యధికంగా ఉండే ఈ ఉప్పును ఎందులో వేసినా ఆ పదార్ధం రుచి మరింతగా పెరుగుతుంది.

       అనేక వ్యాదుల్ని తగ్గించే ఔషదాలు ఇందులో ఎక్కవే. నిత్యం ఈ సైందవలవణం వాడే వారికి ధైరాయిడ్ , బీ.పి, పక్షవాతం , చక్కెర వ్యాధి , కీళ్ళ సమస్యలు మొదలగునవి రావు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అధిక బరువును నియంత్రించటంలో సహాయకారి.
   🍆🍒🍎  కూరగాయలు సైంధవలవణం కలిపిన నీటితో కడిగితే , పెస్టిసైడ్స్ యొక్క దుష్పలితాలను కొంత వరకు నివారించవచ్చు.

      1930 కి ముందు ఉత్తర భారతీయులందరు సైంధవ లవణాన్నే వాడేవారు. ఆంగ్లేయులు దీన్ని నిషేధించి , సముద్రపు ఉప్పును ప్రవేశం పెట్టినారు.

    సైంధవ లవణం ( Rock Salt ) ని వాడి ఆరోగ్యాని పొందండి.

 " ఆరోగ్యమే   మహాభాగ్యం "
 ------ శ్రీ రాజీవ్ దీక్షిత్ ------ 💐

No comments: