Monday, June 5, 2017

13.అంగరాగం గురించి .......

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 13 )

అంగరాగం గురించి .......

      ఆవు పేడతో పొడి రూపంలో ఈ అంగరాగం తయారు చెస్తారు. ఈ అంగరాగంన్ని సబ్బువలే వాడ వచ్చును.

      అంగరాగం అంటే అర్ధం నలుగు పెట్టుకోవడం. ఈ అంగరాగం పొడి రూపంలోనే లభిస్తుంది.

      ఈ పొడిలో కొద్దిగా నీళ్ళు కలిపి ఒంటికి నలుగు పెట్టుకోవచ్చు.

      తలవెంట్రుకల కోసం పుల్లటి మజ్జిగలో కలిపి ఉపయోగించండి.

      ఈ పొడిని పాలలో కలిపి డ్రైస్కిన్ , పొడి బారిన చర్మం కలిగినవారు ఉపయోగించండి.

      ఫేస్ ఫ్యాక్ గాను ఉపయోగపడుతుంది. సన్ బర్న్ వంటి వాటి విషయంలోనూ ఉపశమనాన్ని ఇస్తుంది.

      ఏదైన దెబ్బతగిలినట్లయితే , ఆ దెబ్బకు ఈ పొడిని పట్టించండి , వెంటనే నొప్పి నుండి ఉపశమనం కలుగును.

      ఎవరైనా పూర్తిగా అలసిపోయినట్లయితే , ఈ నలుగును ఒంటికి పట్టించి స్నానం చెయ్యండి , అలసట పూర్తిగా తగ్గిపోతుంది.

      మానసికంగా పూర్తిగా అలసిపోతే నుదిటిపై మందంగా ఆ లేపన్నాన్ని పట్టించి ఒక 15 - 20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. వారి అలసట అంతా తీరిపోతుంది.

      పరీక్షల రోజులలో పిల్లలు ఎక్కువగా అలసిపోతారు. అప్పుడు ఈ లేపనాన్ని నుదుటిపై పట్టించండి. అలసట తీరి ప్రశాంతంగా వుంటారు.

       ఆవు పేడలో అంతటి అద్భతమైన శక్తి కలదు. ఇది ఆవు పేడ యొక్క వైశిష్ట్యం.

          " హరే కృష్ణ "

                 శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: