Monday, June 5, 2017

15.గోమూత్రం గురించి .....

జై గోమాత ...... జైజై విశ్వమాత ( 15 )

గోమూత్రం గురించి ......

    గోమూత్రంలో గంగాదేవి నివాసమని శాస్త్ర వచనము. శ్రీ మహా విష్ణువు పాదాల నుంచి గంగానది ఉద్భవించినది. గంగానది పాపనాశిని. ఏదో ఒక పాపం కారణంగా మనకు రోగాలు వస్తాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ గోమూత్రం పాపాలను నశింప చేస్తుంది. అంటే మనకున్న రోగాల నుంచి అది మనలను విముక్తులను చేస్తుంది.

      ఎవరికైన భూతాలు , ప్రేతాలు , పిశాచాలు పట్టిన యెడల వారికి గోమూత్రం త్రాగించండి , వెంటనే అవి పారిపోతాయి. ఎందుకంటే గంగా మాతను శివుడు శిరస్సుపై ధరించాడు.

      గోమూత్రం ఒక అద్భుత ఔషధం. ఉమ్మెత్త , పాదరసం , జీడి , గన్నేరు , ఇవన్నీ నిజానికి విషములే , అయినప్పటికీ వీటిని గోమూత్రంలో వేయడం వలన వీటిలోని విషం తొలగి అమృతంలాగా పని చేస్తాయి. ఈనాడు మనం నగరాలలో ఎంతో కలుషితమైన వాతావరణంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే మనం ప్రతిరోజూ గోమూత్రం లేక గోమూత్రం ఆర్క్ సేవించే అలవాటు చేసుకుంటే అది మన శరీరంలో చేరిన విషాన్ని క్రమక్రమంగా బయటకు పంపిస్తుంది. గోమూత్రంలో ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇది గొప్ప టానిక్.

       ప్రాణం ఒక అద్భుతమైన తత్వం. ఆవు ప్రసాదించే పంచగవ్యాలలో ప్రాణ శక్తి సంపూర్ణంగా ఉంది.

      ప్రతి వనమూలికా ప్రాణవంతమైనది. అందుకే ఏ వనమూలికను సేవించాలన్నా ముందుగా ప్రణమిల్లాలి. కానీ ప్రస్తుతం అలాంటి నియమాలు ఏవీ పాటించరు. అలా చేస్తే ఆవనమూలికలలోని శక్తి అంతా అంతమైనట్లే.

       మనం వనమూలికలను సేకరిస్తున్నప్పుడు ఆ వనమూలికలకు ముందుగా నమస్కరించాలి.వాటిని పూజించాలి. శరణాగతి భావంతో వాటిని తీసుకోవాలి. వ్యాపారం కోసం కాదు. అప్పుడే ఆ వనమూలికలు అద్భుతమైన ప్రాణ శక్తిని కలిగి ఉంటాయి.

       గోమూత్రాన్ని గోమాత తనంతట తానే కరుణతో ఇస్తుంది. అందుకే గోముత్రం ప్రాణవంతమై ఉంటుంది. గోమూత్రాన్ని ఏ ఔషధంలో వేసినా ఆ ఔషధం యొక్క శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఉదాహరణకి  కరక్కాయను గోముత్రంలో వెయ్యటం వలన కరక్కాయ యొక్క శక్తి 7 రెట్లు , పసుపు యొక్క శక్తి 20 రెట్లు పెరుగుతుంది. కొన్ని ఔషధముల శక్తి 80 రెట్ల వరకు పెరుగుతుంది.

      గోమూత్రంలో ఉన్న అద్భుతమైన ప్రాణ శక్తిని మనము గుర్తించాలి. భారతీయులకు మాత్రమే ఈ ప్రాణ విజ్ఞానం గురించి తెలుసు. తక్కిన విశ్వమంతటకీ తెలిసినది కేవలం జడ విజ్ఞానం మాత్రమే. ఇతర దేశాల వారికి ఈ ప్రాణ విజ్ఞానం గురించి తెలియదు. అందుకే మనము వైజ్ఞానికంగా వెనకబడిన వారం కాము. మనమే ఈ ప్రాణ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రపంచం అంతటకీ అందించవలసిన అవసరం ఉన్నది.

      భారతదేశ వాతావరణానికి వాత , పిత్త , కఫాలకు సంబంధించిన రోగాలు 148 రకాలు ఉంటాయి . ఈ వ్యాధులను అన్నింటిని నివారించగల ఒకే ఒక్క పదార్థము గోమూత్రము మాత్రమే.

         " గోమూత్రే ధన్వంతరి "

                "హరే కృష్ణ "

              శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: