Monday, June 5, 2017

16.ఆయుర్వేద .. వాస్తవ రూపం

జై గోమాత ...... జైజై విశ్వమాత ( 16 )

ఆయుర్వేద .. వాస్తవ రూపం.

       ఆయుర్వేదం అంటే ఆయుష్షుకు సంబంధించిన వేదం అని అర్ధం. ఆయుష్షు అంటే ఆరోగ్యవంతమైన జీవితం. వేదం అంటే జ్ఞానం. ఆయుష్షు యొక్క విజ్ఞానమే ఆయుర్వేదం.

      వైద్యుడు మీ ప్రకృతి ని పరిశీలించి , ఏదైన ఇచ్చినపుడే అది ఆయుర్వేద ఔషదం ఆనిపించుకుంటుంది. మీ ప్రకృతిని అర్ధం చేసూకోకుండా , వైద్యుని చేతి నుంచి మీకు లభించనంత వరకు ఏ మెడిసిన్ అయినా ఆయుర్వేద ఔషధం కాదు.

      ఉదాహరణకి ఎవరికైనా జలుబు చేసినదనుకోండి , కొందరికి తులసి లేదా పసుపు కషాయం త్రాగిస్తాము. కొందరికి జలుబు తగ్గుతుంది. మరికొందరికి జలుబు తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. అందుకు కారణం ఇరువురి ప్రకృతి వేరు. ఒకే పదార్ధాన్ని ఒకరు తినడం వల్ల వారికి ప్రయోజనము చేకూరితే మరొకరు తీసుకోవడం వలన వారికి హాని కలుగుతుంది. ఒక పదార్థము ప్రయోజనమా , హానికరమా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే అది వారి ప్రకృతి ని గమనించడం వలన తెలుస్తుంది.

      పంచగవ్వములలోని విశిష్టతను తెలుసుకున్నట్లుగా , ఆయుర్వేద వైజ్ఞానికతను తెలుసుకుని అనుసరించినట్లయితే ఏ రోగమైన చాలా తక్కువ కాలంలో తగ్గిపోతుంది.

      మనిషి తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఆరోగ్యమైనా , కుటుంబమైనా , సంపద అయినా , జీవితమైనా , సమాజమైనా చివరికి దేశమే అయినా పతనం కాక తప్పదు.

           " హరే కృష్ణ "

                  శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: