Monday, June 5, 2017

18.పేస్టుల గురించి ( Tooth Paste ) ......మన ఆరోగ్యం

😀 మన ఆరోగ్యం ... మనచేతుల్లో ( 18 ).
పేస్టుల గురించి ( Tooth Paste ) .......

      ఉదయాన్నే లేవగానే నోట్లో పిత్తమే నిండి వుంటుంది. దాన్నే లాలజలం అంటాము. దీన్ని కంట్రోల్ చెయ్యటానికి చెట్ల పుల్లలు , చూర్ణములు ఉపయోగించాలి. అదే మీరు పేస్ట్ ని ఉపయోగిస్తున్నారనుకోండి , అందులో చక్కెర వుంటుంది. ఇది పిత్తానికి వ్యతిరేకరం. దీని వల్ల మీ పిత్తం చెడిపోతుంది. ఈ తీపి మీ దంతాలని పాడు చేస్తుంది. ఈ పేస్ట్ ని తయారు చేసేది చనిపోయిన జంతువుల ఎముకలతోటి , పందులు , ఆవులు , మేకలు ఇవి చనిపోయిన తర్వాత వీటి ఎముకల తోటి తయారు చేస్తున్నారు. మీరు సాంప్రదాయం పాటించే శాఖాహారులతై ఇది ఎంత మాత్రం సమంజసమో ఆలోచించండి. ఈ పేస్ట్ లో విషపూరతమైన కెమికల్స్ వాడటం వలన పండ్లు పుచ్చిపోవడం , ఊడిపోవడం లాంటి మొదలైన రోగాలకు కారణమవుతుంది.

      పళ్ళు తోముకునే పదార్ధం కషాయంలాగ , అంటే చేదుగా ఉండాలి. అంటే పిత్తాన్ని తగ్గించడానికి చేదుగా ఉండే పదార్ధాలకే సాధ్యం కనుక , వేప పుల్లతో , ఉమ్మెత పుల్లతో , తుమ్మపుల్లతో , అర్జున , మామిడి , జామ వంటి పుల్లలతో పళ్ళు తోముకోవడం మంచిది. వేసవిలో వేప , చలికాలం జామ , వర్షాకాలము మామిడి లేదా అర్జున పుల్లలతో పళ్ళు తోముకోవడం మంచిది. మీకు ఇవి దొరకవు అనుకుంటే పళ్ళ పోడిని వాడండి లేదంటే అన్ని కాలాల్లో అందరు వాడదగినది త్రిపుల చూర్ణం.

      త్రిపుల పళ్ళ పొడి చూర్ణం ... ఇందులో సైందవ లవణం కలిపితే ఇది మంచి దంతమంజనం.

      ఆవు పేడను ఎండబెట్టి కాల్చాలి. ఆ బూడిదలో కాస్త కర్పూరం , కాస్త సైందవ లవణాన్ని కలపాలి. ఇది కూడ చాలా మంచిది.

  " ఆరోగ్యమే  మహాభాగ్యం "

     ----  శ్రీ రాజీవ్ దీక్షిత్..... 🙏

Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world

No comments: