Monday, June 5, 2017

18.వాతము దాని స్వరూపం గురించి ......

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 18 ).

వాతము దాని స్వరూపం గురించి ......

       ఈ ప్రకృతి పంచతత్వములతో తయారయ్యింది. అవి 1. ఆకాశం. 2 . వాయువు. 3 . అగ్ని . 4. జలము. 5 . పృధ్వీ ( భూమి ) .

ఆకాశము +  వాయుతత్వములు కలిస్తే వాతము.

అగ్ని + జలతత్వములు కలిస్తే పిత్తము.

జలము + పృధ్వీ తత్వములు కలిస్తే కఫం.

        ఎన్ని రోగాలు ఉన్నా ఆ రోగాలు అన్నీ ఈ మూడింటిలోనే ఉన్నాయి .

      వాతములో ఆకాశము +  వాయువు ఉన్నది ఇందులో ఆకాశం ఇన్ యాక్టివ్ , నిష్క్రయమైనది. ఆకాశాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఐతే వాయువును మాత్రం అర్ధం చేసుకోగలం.

       ఈ వాయువులో 5 గుణాలు ఉంటాయి. 1. గతి అంటే గమనం. 2. శోషింప చేయడం. ( ఆర బెట్టి పొడి బారే లాగ చెయ్యటం ) 3. చల్లదనం . 4 .  వాయువు తనంతట తానుగా జొరబడం. 5  పరివర్తన ( మార్పు ).  ఈ మార్పు అనేది వాయువు యొక్క ప్రధానమైన గుణం.


          " హరే కృష్ణ "

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: