Monday, June 5, 2017

19.వాతము దాని స్వరూపం గురించి ......

జై గోమాత ...... జై జై విశ్వమాత ( 19 ).

వాతము దాని స్వరూపం గురించి ......

       వాతము మొట్టమొదటి లక్షణం గతి అంటే గమనం. మన గతిలో , మన గమనంలో ఏదైనా తేడా గమనిస్తే ఇక శరీరంలోకి ఏదో వాతానికి సంబంధించిన రోగం వస్తున్నట్లే. మీ కదలికలు ఏవైనా చేతి కదలికలైనా , కాళ్ళ కదలికలైనా , మెడ కదలికలైనా , నడుము కదలికలైనా , ఎముకలైనా , కండరాలైనా స్టిప్ అవుతున్నట్లయితే , ఏమైనా నొప్పి కలిగిస్తున్నట్లయితే వాతానికి సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు గుర్తించిండి. వాటిని అప్పుడే నియంత్రించాలి.

       వాతము శరీరంలో అత్యంత తీవ్రం అయితే పక్షపాతం వస్తుంది. పార్కన్ సన్స్ , చెయ్యి ఏమీ కారణం లేకుండానే వణకుతుందంటే శరీరంలో వాతం ప్రకోపించినది అని అర్ధం.

      సూక్ష్మ జగత్తులో అత్యంత వేగం మనసుది్.  అయితే స్థూలజగత్తులో వేగవంతమైన గమనం వాయువుది. ఈ గతి లయబద్ధంగా ఉంటే అది హాని చెయ్యదు. గతి వేగవంతమయినా లయ బద్ధంగా ఉంటే మీకు హాని కలుగదు.

      మనం సంకీర్తన చేస్తున్నపుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానికి కారణం ఆ సంకీర్తన లోని లయబద్ధమైన భగవన్నామ సంకీర్తనను మనం నెమ్మది నెమ్మదిగా ప్రారంభిస్తాం. క్రమక్రమంగా అది వేగాన్ని పుంజుకుంటుంది. ఆ సంకీర్తనలో నిమగ్నమౌతూ పోతాం. లయబద్ధం కాని గమనం వాతరోగాలను కలిగిస్తుంది. ప్రస్తుతం మనం సంగీతం పేరుతో వింటున్నది ఎక్కువగా గోలమాత్రమే. అది పూర్తిగా లయబద్ధమైనది కాదు. అందుకే ఈ మధ్య కాలంలో వాత రోగాలు ఎక్కువగా పెరుగుతున్నాయి.

           " హరే కృష్ణ "

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: