Monday, June 5, 2017

19.భోజన విధానం గురించి ......మన ఆరోగ్యం .

🍒మన ఆరోగ్యం ..... మనచేతుల్లో  ( 19 ).

భోజన విధానం గురించి .......

      మనము ఎప్పుడు పడితే అప్పుడు తినరాదు. ఎందుకంటే కడుపులో జఠరాగ్ని ఉంటుంది. అది ప్రదీప్తమై ఉన్నపుడే ఆహారాన్ని పచనం చేస్తుంది , అలా పచనం అయిన ఆహారమే మన శరీరానికి ఉపయోగపడుతుంది.

సూర్యోదయం అయిన తర్వాత రెండు గంటల వరకు ప్రదీప్తమై ఉంటుంది. కనుక ఆ సమయంలోనే అత్యధికంగా భోజనం చేయవలెను. అంటే సుమారుగా 9 గంటలనుండి 9.30 గంటలోపే ( లంచ్ ) భోజనం చేయాలి. టిఫిన్ ( బ్రేక్ ఫాస్ట్ ) కాదు. ఈ సమయంలో అల్పా హారాన్ని మాని భోజనం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మీరు తిన్న అన్నంలో ప్రతిగించ , ప్రతిమెతుకు పూర్ణంగా శరీరానికి ఉపయోగపడుతుంది. ఇలా జఠరాగ్ని పని చేసే సమయంలోనే ఆహారం తీసుకోవాలి. ఎంత తినగలరో అంత ఆహారం తినాలి. మీకు అత్యంత ఇష్టమైన ఏ స్వీట్స్ అయినా ఇంకా ఏ పిండి వంటకమైన ఉదయమే తృప్తిగా తినండి.

      మధ్యాహ్న భోజనం ఉదయం తిన్న పరిమాణం కంటే తక్కువ తినాలి. అలాగే సాయంత్ర భోజనం మధ్యాహ్న భోజనం కంటే తక్కువ తినాలి.

      సాయంకాలం భోజనం సూర్యాస్తమయానికి  40 ని:: ల ముందుగా భోజనం చెయ్యాలి.

      రాత్రి పూట ఏదైన తీసుకోవాలనిపిస్తే అది కేవలం పాలు మాత్రమే ఉత్తమమైన ఆహారం.

      మనం ఎక్కువ కాలం తృప్తికరమైన భోజనం చేయకపోతే డిప్రెషన్ , సిజోఫ్రేనియా వంటి భయంకరమైన 27 రకాల మానసిక రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నది.

      డయాబెటిస్ , అస్తమా , ఇంకా వాతపు సమస్యలు ఉన్న ఎవరైనా ఇలా ఆహార నియమాలను పాటించి రోగ విముక్తులు కండి.

      అందరూ ఈ నియమాన్ని పాటించి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

      మనం భోజనం ఎప్పుడు చేసినా నేలమీద కూర్చొని మాత్రమే భోంచేయాలి. ఇలా కూర్చోవటం వల్ల మన జఠరంలో అగ్ని బాగా ప్రదీప్తమవుతుంది. కుర్చీలో కూర్చుండటంవల్ల అగ్ని తీవ్రత తగ్గి పోతుంది . ఇక నిలబడి ఉన్నప్పుడు అగ్ని తీవ్రత పూర్తిగా తగ్గి పోతుంది.

      ఎల్లప్పుడు క్రింద కూర్చుని. సుఖాసనంలో భోజనం చెయ్యాలి.

       " ఆరోగ్యమే ... మహాభాగ్యం "

                ... శ్రీ రాజీవ్ దీక్షిత్.....🙏


Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world

No comments: