Monday, June 5, 2017

1.మన ఆరోగ్యం - మనచేతుల్లో

మన ఆరోగ్యం - మనచేతుల్లో

    ఆరోగ్యము అవసరము లేనిది ఎవరికి. ఆరోగ్యము అందరికీ అవసరమే. అయితే ప్రపంచములో 75% రోగాలే ఉన్నా తనచుట్టూ అందరూ రోగులే ఉన్నా తమకు రోగమొస్తే కాని ఆరోగ్యము గురించి ఆలోచించక పోవటం మరియు జాగ్రత్త పడక పోవటం అందరికీ అలవాటయి పోయినది.

      లోకంలో అందరికీ వచ్చే జబ్బు లలో అత్యధిక శాతము తాము తెలిసో తెలియకో చేతులారా కొని తెచ్చుకున్నవే. యేగం, వ్వాయామం, ప్రాణాయామం వంటి కొద్ది పాటి శ్రమతో కూడుకున్న జాగ్రత్తలు పాటించకపోయినా కేవలం ఆహార వ్వవహారాలను మనం చేసుకోగలిగే చిన్న చిన్న మార్పులతోటి చిన్న చిన్న జాగ్రత్తలతోటే మనం నిండు నూరేళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించగలం. ఏమాత్రం ఖర్చులేని, ఎంతో సులువైన, ప్రయోజనకరమైన, విలువైన సందేశాలను అందించారు మన మహర్షులు వాగ్భటాచార్యులు. వారి సందేశాలను ఎంతో లోతైన పరిశోధన చేసి మనకు అందే రీతిలో మనముందుంచి సమాజానికి ఎనలేని మేలుచేశారు శ్రీ డా! రాజీవ్ దీక్షిత్ గారు.
      మనవంటిల్లే మన ఆరోగ్యాలయం. కొన్ని చిన్న చిన్న విషయాలు కూడ తెలియక పోవటంవల్ల మనం ఎంతో దారుణమైన రోగాల బారిన పడుతున్నాము.
      రేయింబవళ్ళు శ్రమించి మనం కూడబెట్టిన ధనములో 70% డాక్టర్లకు ఖర్చు పెడుతున్నాము.
      అందరూ రోగరహితువ్వాలన్నదే డా: రాజీవ్ దీక్షిత్ గారి మహా సంకల్పం.
      మన "రాజీవ్" గారు శ్రీ వాగ్భటాచార్యులు వ్రాసిన అష్టాంగ హృదయమ, అష్టాంగ సంగ్రహములను గురించి తెలియజేసినారు. కొన్ని సంవత్సరాల పాటు పరిశోధించి మనకు అత్యంత సులభంగా , సరళంగా అర్ధమయ్యే విధంగా తెలియజేసినారు. ఈ నియమాలను అర్ధం చేసుకుని పాటిస్తే మనం పరిపూర్ణ ఆరోగ్యంగా పూర్ణాయుషుతో జీవించగలం.


      శ్రీ రాజీవ్ దీక్షత్ గారి ప్రసంగాలను U Tube  ద్వారా (అన్ని భాగాలను) విని ఆలోచించి ఆచరించి సంపూర్ణ ఆరోగ్యాని పొందగలరు.

      "సర్వే జన సుఖినోభవంతు"

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: