Saturday, June 3, 2017

2.గోసేవ వరల్డ్ ఎలా పుట్టింది-స్థాపించటానికి ముఖ్య కారణాలు- లక్ష్యాలు

గోసేవ వరల్డ్ ఎలా పుట్టింది-స్థాపించటానికి ముఖ్య కారణాలు- లక్ష్యాలు:
*******************************************************************************


అది 2004 వ సంవత్సరం, కాలేజ్ చదువుతున్న రోజుల్లో మొదటిసారి మా లెక్చరర్ shaik sharif khan తరుచుగా వీధిలో వుండే ఆవులు ప్లాస్టిక్, క్యారీబ్యాగ్ లు తింటున్నాయి అవి మనం నిత్యం వాడే ప్లాస్టిక్ బ్యాగులలో, కిచెన్ వేస్ట్ వాటిలో నింపి డస్ట్ బిన్స్ లొ వేయడం కారణంగా వాటి చావుకి మనం కారణం అవుతున్నాము . ఇవి కడుపులో ఉండి పోయి విపరీతమైన భాదతో చనిపోతున్నాయి అని తరచుగా చెబుతూ వుండేవారు.

కాని ఈ విషయంపై ఎక్కువగా ఆలోచన చెయ్యాలని అనిపించలేదు బహుశ  ఏ అనుభవం దగ్గరగా కనపడలేదు కనుకనేమో  !ఇలాంటి పరిస్థితి కొన్నింటికి మాత్రమే  అయ్యిఉండవచ్చు అని అనుకున్నాను.     

మనస్సు ను కలిచివేసిన సంఘటనలు:
*********************************************
కొన్ని సంవత్సరాల తరువాత నిద్రను మేలుకోలిపే రోజులు ఈ క్రింది సంఘటనలతో కళ్ళముందు నిలబడ్డాయి.
ఆవులు వాల్ పోస్టర్లు,క్యారీ బ్యాగ్ లు,కాయిన్ లు ,ఇసుక, చెప్పులు ఇంకా చెప్పకూడని విషయం ఏంటంటే ఉపయోగించి పారేసిన న్యాప్కిన్ ప్యాడ్లు తినడం, ఇవే కాకుండా ,బీఫ్ కోసము బీఫ్ షాపులు దగ్గర నిలబడటం, రోడ్ మీద జరిగే  ఏక్సి డెంట్ లలో చనిపోవడం చెన్నై మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో చూశాను.ఇది  కేవలము చెన్నై లోనే కాదు దేశము మొత్తం ఇదే దుస్థితి అని google చెబుతుంది.పవిత్రమైన జంతువుల కోసము"కరుణ సొసైటీ " సంస్థ ద్వారా విదేశీ మహిళ పోరాటం చేయటాన్ని ఆశ్చర్యం కలిగించింది.

"The Plastic cow" అందరూ తప్పక చూడవలసింది.50 కిలోలు పైగా ప్లాస్టిక్ వ్యర్దాలను ఆవుల కడుపులో నుండి ఆపరేషన్ చేసి బయటికి తియ్యడం ప్రత్యక్షంగా చూపించారు.
మనకి కంటి లో నలుసు పడితే ఉండే భాధ  ఒక ఎత్తైతే, ఏ కారణము చేతనైన కడుపు నొప్పి వస్తే ప్రాణము పోయే అంత పని అయ్యింది అంటాము.మరి గోమాత గా పిలవబడే పవిత్రమైన గోవు ఎవరికీ చెప్పుకోలేక ఎంత భాధను అనుభవిస్తుంది అనే ఆలోచన నుంచే పుట్టిందే గోసేవ వరల్డ్ .         Next 

No comments: