Monday, June 5, 2017

20.వాతము దాని స్వరూపము ( ఎసిడిటి ) గురించి ....

జై గోమాత ... జై జై విశ్వమాత.( 20 ) .

వాతము దాని స్వరూపము  ( ఎసిడిటి ) గురించి ....

       గుండె వేగంగా కొట్టుకోవడం , ఎసిడిటి , ఈ రోగాలు పిత్తానికి సంబంధించినవి కావు. ఎసిడిటిలో 20 % పిత్తం + 80 % వాతము ఉంటుంది . కాబట్టి ఇవి వాతానాకి సంబంధించిన రోగం .

      మన కడుపులోని భోజనం 3 గంటలలో జీర్ణం అయిపోవాలి . జీర్ణం కాని ఆహారం ముందుకు కదలదు . దానికి గమనం ఉండదు . ఆ ఆహారం అక్కడే కుళ్ళడం మొదలవుతుంది . అది ఎక్కువ కాలం వుండటం వలన అనేక విషవాయువులు తయారవుతాయి . కాబట్టి నిజానికి ఎసిడిటి వాతానికి సంబంధించిన రోగం. కానీ వైద్యులందరూ పిత్తానికి చెందిన రోగంగా భావించి చికిత్స చేస్తూ ఉన్నారు . అందువలన 10 -- 15 సంవత్సరములైన ఆ ఎసిడిటి నయం కాదు . ఎసిడిటిలో గతి ఆగిపోయింది . దానికి గమనం ఉండదు . మనం వాతాన్ని తగ్గించినట్లయితే ఈ ఎసిడిటి తగ్గిపోతుంది .

      మవబద్ధకం కూడా వాతానికి చెందినదే . ఎందుకంటే మలం ముందుకు కదలడం లేదు . ఇదే కోణంలో మీరు ప్రతి విషయాన్ని పరిశీలించండి . కళ్ళు రెప్పలు వేరడం , గండె కొట్టుకోవడం , ఊపిరి తీసుకోవడం , వదలడమూ గతియే . ఊపిరి తీసుకోవడం ఇబ్బంది కలిగితే ఆ జబ్బును ఆస్ధమా ( ఉబ్బసం ) అంటారు . ఇది కూడా వాతానికి చెందిన జబ్బు . ఏవిధమైన రోగం వచ్చినా ఆ రోగం యొక్క పేరులో చిక్కుక పోకండి . ఆ రోగ లక్షణం ద్వారా దేనికి సంబంధించిన రోగమో గుర్తించి దానిని నియంత్రించాలి .

      లయబద్ధమైన గమనం వల్ల వాతం పెరగదు . లయబద్ధంకాని గమనం వల్ల వాతం పెరుగుతుంది . మన ఇంట్లో వున్న ఫ్యాన్ వాతాన్ని చాలా ఎక్కువగా పెంచుతుంది . మనం పూర్తిగా ఫ్యాన్ క్రిందనే పడుకంటాము . దానతో ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిష్ గా జడంగా తయారయి ఉంటిము . కాబట్టి వేగంగా తిరిగే ఫ్యాన్ క్రింద పడుకోకూడదు . కాస్త ప్రక్కకు జరిగి పడుకోవాలి . కొద్దిగా పలుచటి దుప్పటి కప్పుకోవాలి . గాలి నేరుగా శరీరానికి తగలకుండా చూసుకోవాలి .

     మోటరు సైకిల్ ను కేవలం నడపాలి . గాలిలో ఎగురుతున్నట్లు కాదు . అలా చేయడం వల్ల గాలి ఎక్కువగా తగలదు .

      బస్సులో లేక ట్రైన్ లో కాని ఎవరయితే విండో సీట్ దగ్గర కూర్చొని ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ వుంటారో వారికి వాతం పెరుగుతుంది . కాబట్టి విండోసీట్ మోజును పూర్తిగా వదిలి పెట్టండి . మీ ఆరోగ్యంమూ బాగుంటుంది .

         ' హరే కృష్ణ '

                     శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: