Monday, June 5, 2017

21.వాతము దాని స్వరూపం గురించి. ( పెదవులు , మడమలు పగులుట , చుండ్రు )....

జై గోమాత ... జైజై విశ్వమాత ‌( 21 ).

వాతము దాని స్వరూపం గురించి.
( పెదవులు , మడమలు పగులుట , చుండ్రు )....

వాతము యొక్క రెండవ లక్షణం ఆరబెట్టడం , పొడిగా ఉండటం .

వాతము శరీరం అంతటా పెరిగినపుడు , చర్మం పొడిబారి పోతుంది . పెదవులు , మడమలూ పగలుతూ ఉంటాయి . తలలో చుండ్రు వచ్చును .

       పెదవులు పగిలితే వ్యాజలీన్ పట్టిస్తాం  . కానీ వాతం పెరిగినది కేవలం పెదవులలోనేనా , వాతం శరీరం అంతటా పెరిగినది . అయితే అది పెదవులలో బహిర్గతమైనది . పెదవులకు వ్యాజలీన్ పూసుకోవటంతోనే సరిపెట్టుకోకూడదు . అలా చెయ్యడం ఆపకుండానే శరీరమంతటికీ చికిత్స చేయాలి .

తలవెంట్రుకలకు నూనె పట్టించాలి . సరే దానితో పాటు శరీరమంతటినీ నూనెతో మర్దన చేయాలి . అలా చేసినప్పుడే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది .

      మడమలు పగులుతూ ఉంటాయి . అప్పుడు క్రాక్ క్రీమ్ పెడుతూ ఉంటారు . కానీ శరీరం అంతా తైలంతో మర్ధన చేసినట్లయితే దాని అవసరమే రాదు . ఇలా చర్మం పొడిబారిపోవటం పైకి కనిపిస్తుంది , కాని నిజానికి శరీరంలో వాతం పెరిగింది .

      మన శరీరంలోని వాతాన్ని తగ్గించక పోయిన యెడల , ఈ పొడి బారడం అనేది మన ప్రేగులలోకి చేరుతుంది. ప్రేగులు పొడి బారి పోవడం వలన మనము తిన్న ఆహారము ముందుకు కదలదు . అలా మలఫద్ధకం వస్తుంది .

           " హరే కృష్ణ "

              శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: