Monday, June 5, 2017

22.వాతము దాని స్వరూపం ( మలబద్ధకం , బ్లడ్ ప్రెజర్ ) గురించి .....

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 22 ).

వాతము దాని స్వరూపం ( మలబద్ధకం , బ్లడ్ ప్రెజర్ ) గురించి .....

       శరీరంలో వాతం పెరిగిన యెడల మలబద్ధకం వస్తుంది . ఎవరికైనా మలబద్ధకం ఉంటే వారికి ఎనిమా ఇస్తారు . దాని వల్ల ప్రేగులలో ఉన్న ఆ పొడిబారినతనం ఇంకా పెరుగుతుంది . అలా చెయ్యడం శాశ్వతమైన పరిష్కారం కానే కాదు . అలా చెయ్యటం వలన రోగి క్రమక్రమంగా క్రానిక్ పేషంట్ గా , తీవ్రమైన రోగిగా మారిపోతాడు . దీనికి పరిష్కారం పాలలో నెయ్యిని కలిపి తీసుకొనడం వలన ప్రేగులలోని ఆ స్నిగ్ధత్వం , ఆమృదుత్వం వస్తుంది . అప్పుడు మనము తిన్న ఆహారాన్ని ముందుకు చేరవేయ గలుగుతాయి .

      అప్పటికీ మనం దృష్టి పెట్టకపోతే , పొడిబారడం క్రమక్రమంగా మన రక్తనాళాలలోకి చేరుతుంది .  పొడిబారిన ఏ పదార్ధమైనా గట్టిగా తయారవుతుంది . అలా క్రమంగా మన ధమనులు గట్టి పడుతూ ఉంటాయి . మన గుండె రక్తాన్ని పంపించటానికి గాను ఎక్కువ వోత్తిడిని ( ప్రెజర్ ) చెయ్యవలసి వుంటుంది . ఇలా ప్రెజర్ పెరగడానిని మనం హై బ్లడ్ ప్రెజర్  ( అధిక రక్తపోటు ) అంటాము . అధిక రక్తపోటుకు చికిత్స చేయాలంటే , వాతినికి చికిత్స చేయాలి . హైబ్లెడ్ ప్రెజర్ ఉన్న వాళ్ళు ఆవు నెయ్యిని తీసుకోవాలి .

           " హరే కృష్ణ "

            శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: