Monday, June 5, 2017

24.వాతము దాని స్వరూపం ( చల్లదనం , కీళ్ళ నొప్పుల ) గురించి .....

జై గోమాత .....జై జై విశ్వమాత ( 24 ).

వాతము దాని స్వరూపం ( చల్లదనం , కీళ్ళ నొప్పుల ) గురించి .....

      వాతము యొక్క మూడవ లక్షణం చల్లదనం . వాతరోగులకు చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి . ఎందుకంటే చల్లదనం వల్ల వాతం పెరుగుతుంది . మన శరీరంలో వచ్చే నొప్పులు 90 శాతం వరకూ వాతం కారణంగానే వస్తాయి . ఏ.సి.
 లేకుండా ఉండటానికి , ఏ . సి. లేకుండా పడుకోవటానికి అవవాటు పడటం మంచిది . అందుకే చల్లదనం నుంచి సంరక్షించుకోవటానికి మార్గం వేడి. కావున వేడి పదార్థాలు తీసుకోవాలి .

      ఈ మధ్య ఒక ఫ్యాషన్ తయారయింది . డిన్నర్ లో ముందుగా స్టార్టర్ , స్టార్టర్ తర్వాత వేడి వేడిగా డిన్నర్ , డిన్నర్ తర్వాత చల్లటి ఐస్ క్రీంని తింటారు . ఇది చాలా అనారోగ్య కరమైన పద్ధతి . వేడి మీద చల్లటి పదార్ధాలను వెయ్యడం . సరైన పద్ధతి ఏమిటంటే చల్లటి పదార్ధాల మీద వేడి పదార్ధాలను వెయ్యడం. నిజానికి ఐస్ క్రీమే తినకూడదు . ఒక వేళ మీరు ఐస్ క్రీమ్ తినవలెను అనుకొనినయెడల ముందుగా ఐస్ క్రీమ్ ను తినండి. ఆ తరువాత వేడిగా డిన్నర్ చివరగా వేడి వేడీగా సుపుని తీసుకోండి . ఇది సరైన + ఆరోగ్యకరమైన పద్ధతి .

       మన భారతదేశానికి చెందిన సూప్ లు  వేడి వేడి మజ్జిగ పులుసు , పలుచగా ఉండే పప్పు  , వేడివేడిగా రసం . మన సూపులు ఉత్తమమైనవి . చివరగా మనము వేడి పదార్ధాన్ని తీసుకుంటే మనం తిన్నది , త్రాగినది తేలికగా జీర్ణం అవుతుంది . ఈ సూపులు మీకు అందుబాటులో లేకపోతే వెంటనే సగం గ్లాసు వేడి నీళ్ళు త్రాగండి . మాములు నీళ్ళు గంట తరువాత తీసుకోవచ్చు .

      కీళ్ళకు చెందిన నొప్పలన్నీ వాతానికి సంబంధించినవే .     కీళ్ళ నొప్పులు ఉన్నవారు భోజనం చేసిన.వెంటనే వేడి నీళ్ళు త్రాగాలి . మాములు నీళ్ళు గంట లేక గంటన్నర తరువాతనే త్రాగాలి. ఎవరికైనా వేడి నీళ్ళు తీసుకోవడం ఇష్టం లేక పోతే అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తీసుకోండి. అంటే మీకు ఏది సరిపడితే అది . కొందరికి నిమ్మరసం సరిపడదు . పై రెండు సరిపడని వారు మన దేశము యొక్క అద్భతమైన సూపులు తీసుకోండి. ఇలా చెయ్యడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది . కాబట్టి చలువకు వ్యతిరేకం వేడి. ఈ పద్ధతి వలన మీరు ఆరోగ్యవంతులుగా వుండగలరు .

         " హరే కృష్ణ "

             శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

No comments: