Monday, June 5, 2017

26.వాతము దాని స్వరూపం ( స్ధూలకాయం ) గురించి .....

జై గోమాత .... జై జై విశ్వమాత . ( 26 ).

వాతము దాని స్వరూపం ( స్ధూలకాయం ) గురించి .....

      కొందరు బాగా చిక్కిపోయి పూర్తిగా కొందరు అస్తిపంజరం లాగా కనిపిస్తుంటారు . ఇది కూడా వాత రోగమే . ఎందుకంటే వాయువు వాళ్ళని ఆరబెట్టేసింది . స్ధూలకాయులు కూడా వాతరోగులే . ఎందుకంటే వారిలోకి వాయువు చొరబడింది . గాలిబుడగలో వాయువు చేరితే బాగా ఉబ్బిపోతుంది . అలాగే గాలి పూర్తిగా తీసివేస్తే అది చిక్కిపోతుంది . దేశవాళీ ఆవును తీసుకోవడం వలన లావుగా ఉండేవాళ్ళు 8 నుండి 10 కిలోల వరకు తగ్గుతారు . ఎందుకంటే లోనికి చోరబడి ఉన్న వాయువు తొలగి పోతుంది . 1 కిలో ఆవు నెయ్యి తీసుకునేసరికి చాలా వరకు బరువు తగ్గడం జరుగుతుంది .

      లావుగా ఉన్నవాళ్ళతో డాక్టర్ నెయ్యిని తినవద్దు అంటూ ఉంటారు . వాళ్ళ మాటను పాటిస్తూ వాళ్ళు మరింత లావుగా మారుతూ ఉన్నారు . ఎందుకంటే లోనికి గాలి చొరబడుతూ ఉంది . శుద్ధమైన ఆవు నెయ్యి ని తీసుకోవడం వలన మొత్తం సక్రమంగా నిర్వహించబడుతుంది . కాబట్టి నెయ్యిని తీసుకోవాలి .

      నెయ్యిని తీసుకొనే విధానం..

          ఒక గ్లాసు వేడి వేడి ఆవు పాలలో 1 లేక 2 చెంచాల నెయ్యి కలిపి , రెండు గ్లాసులతో ఎక్కువ సెపు సుమారు 20 - 25 సార్లు పైకీ క్రిందకి తిరగతిప్పాలి . అప్పుడు ఆ పాలను త్రాగవలెను . లేదా కిచిడిలో నెయ్యి బాగా ఎక్కువగా ( కిచిడి పూర్తిగా తెల్లగా అయ్యేలాగా ) కలుపుకొని వేడి వేడి కిచిడి తీసుకోవాలి . అలా చేయడం వలన మీ శరీరం బరువు తగ్గడం మొదలవుతుంది .

              ' హరే కృష్ణ '

                   శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .


Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: