Monday, June 5, 2017

25.వాతము దాని స్వరూపం ( దైరాయిడ్ + ఉపవాసాల ) గురించి

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 25 ).

వాతము దాని స్వరూపం ( దైరాయిడ్  +  ఉపవాసాల )  గురించి .....
       
          వాతము ( వాయువు ) కు వున్న నాలుగవ లక్షణం జొరబడి తిష్టవేయడం .

      ధైరాయిడ్ ఉన్నవారు ఫ్యాన్ క్రింద పడుకోకూడదు . ఎందుకంటే ఫ్యాన్ గాలి చెవుల ద్వారా మీలోకి ప్రవేశించి ఈ ధైరాయిడ్ సమస్యను పుట్టిస్తుంది . మీరు తప్పకుండా   ఫ్యాన్ క్రిందనే పడుకోవలసి వస్తే కొద్దిగా శుద్ధమైన కొబ్బరి నూనే ప్రతి రెండు మూడు రోజులకు ఒక సారి చెవిలో వేసుకుని , పడుకునే ముందు దూదితో చెవులను మూసి పడుకోండి . ఇలా చెయ్యడంతో పాటు ముక్కులో నేతి చుక్కలు వేసుకోండి. ఈ ధైరాయిడ్ సమస్య వెంటనే నయమవుతుంది . చెవులలో గాలి దూరడం వలన ఈ ధైరాయిడ్ సమస్య వస్తుంది .

      ఉదయం నిద్ర లేవడంతోటి కొందరికి ముఖం ఉబ్బిపోయి ఉంటుంది . అటువంటి వారు పై పద్ధతిని పాటించి ఆరోగ్యాన్ని పొందండి .

ఎక్కువ ఉపవాసాలు చేస్తూ వుంటే కొన్ని విషయములను గమనించ వలెను .

      ఉపవాస సమయంలో వేడి నీటిని త్రాగుతూ ఉండండి . ఉపవాస సమయంలో చల్లటి పండ్ల రసాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి . ఎక్కువ సేపు కాళీ కడుపుతో ఉండడం వలన వాయువు జొరబడి వాతం పెరుగుతుంది . చొరబడిన గాలి పెరిగే కొద్దీ ఎన్నో సమస్యలు వస్తాయి . ఎందుకంటే ఆ వాయువు మొదట కడుపులోనికి చేరి అక్కడి నుండి వేరు వేరు అవయవాలకు చేరుతుంది . దానివల్ల కొందరికి చేతుల నొప్పులు , కాళ్ళ నొప్పులు , నడుం నొప్పులు వస్తాయి . కావున ఉపవాస సమయంలో వేడి నీళ్ళు త్రాగడం వలన మీకు ఏ హాని కలుగదు .

          " హరే కృష్ణ "

               శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: