Monday, June 5, 2017

28.వాతము దాని స్వరూపం ( నీళ్ళు త్రాగే పద్ధతి ) గురించి ....

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 28 ).

వాతము దాని స్వరూపం ( నీళ్ళు త్రాగే పద్ధతి ) గురించి ....

       ఎవరైనా , ఎపుడైనా మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు . ముందుగానే నీళ్ళు త్రాగి ఆ తర్వాత మూత్ర విసర్జన చెయ్యండి .

       మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు తీసుకొంటూ ఉంటే రాబోయే కాలంలో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం అనే వ్యాధి వస్తుంది .

      మల విసర్జన విషయంలో కూడా శౌచక్రియకు ముందే మంచినీళ్ళు త్రాగి వెళ్ళండి . తరువాత నీళ్ళు త్రాగకండి . మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగుతూ ఉంటే మలబద్ధకం వస్తుంది .

      చాలా మంది స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగుతూ ఉంటారు . అలా ఎప్పుడూ చెయ్యకూడదు . అలా చెయ్యడం వలన ఊపిరితిత్తులపైన ప్రభావం పడుతుంది . స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మవ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది . అందువలన ముందుగా నీళ్ళు త్రాగి తరువాత స్నానం చెయ్యండి .

       రాత్రి నిద్ర మధ్యలో మెలకవ వచ్చి దాహం వేస్తే మీరు నిస్సంకోచంగా నీళ్ళు త్రాగి పడుకోవచ్చు . ఎందుకంటే మీరు ముందు పడుకునే ఉన్నారు . నీళ్ళు త్రాగిన తరువాత కూడ పడుకుంటారు . పరివర్తన అంటూ ఏమీ జరుగలేదు . స్రీలు వంటలు పూర్తిగా చేసిన తరువాత నీళ్ళు త్రాగరాదు . అది మీకు హాని చేస్తుంది . కాని వంటలు చేసేటప్పుడు మధ్యలో నీళ్ళు త్రాగి వంటలు పూర్తి చేయండి . మీరు ఎండలో తిరుగుతూ ఉంటే తిరుగుతూ తిరుగుతూ మీరు మధ్యలో నీరు త్రాగండి . ఏ హీని జరుగదు . కానీ మీరు ఎండనుండి నీడకు వచ్చిన వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి .

       ఏ విధమైన పరివర్తన తరువాత కూడా వెంటనే నీళ్ళు త్రాగకూడదు . ఇది ఒక సాధారణమైన సూత్రం .

           " హరే కృష్ణ "

              శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: