Monday, June 5, 2017

2.ఆయుర్వేదంలో మన ఆరోగ్యం .... మనచేతుల్లో

మన ఆరోగ్యం .... మనచేతుల్లో ( 2)
      ఎంతోమంది గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యుల సలహాలతో పాటు , ఆధునిక చరకునిగా పిలువబడే డా! వార్డేకర్ గారి సలహా ఏమిటంటే భారత దేశంలో అందరూ ఆరోగ్యవంతులు కావాలంటే ( ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే మార్గం ) తమకు తామే వైద్యం చేసుకోవలసి ఉంటుంది. మరో మార్గం లేదు.
      మరో మార్గమే ఆయుర్వేదం. పూర్వం మన ఆయుర్వేద వైద్యులు మన నాడి ఒక్క నిముషం పట్టుకుని మనం వారం రోజుల క్రితం తిన్న ఆహారం ఏమిటో కూడా తెలిపే గొప్ప వైద్యులు ఉన్నారు. కాని ఇప్పుడు మనం అనుసరిస్తున్న ఈ అల్లోపతి వైద్య విధానంలో ఉన్న ముఖ్య సూత్రం ట్రైల్  ఎండ్ ఎర్రర్ ( Trail and Error). అంటే ప్రయత్నించు తప్పులు చెయ్యి , సరిచూసి బాణం వెయ్యి తగిలితే సరే లేదా అంతే, కొన్ని సార్లు రోగి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు డాక్టర్ ఏమంటాడు నేను చెయ్యగలిగినంత చేశాను అంటాడు. మనం ఏం చెయ్యగలం సరే అని ఏడుస్తూ వెళ్ళిపోతాం.

      ఎందరో ఆయుర్వేద ఋషులు చెప్పిన ఒకే ఒక మాట ఏమిటంటే - రోగి అయినవాడే అందరికంటే గొప్ప వైద్యుడు. అనుభవిస్తున్న రోగికి తెలిసినంతగా రోగం ఏమిటో దుఃఖం ఏమిటో ఎవరికీ తెలియదు. అయితే ఆరోగికి కావల్సింది కొద్ది పాటి జ్ఞానంమాత్రమే. ఆ జ్ఞానమే ఉంటే వారి రోగముతో వారే పోరాడ గలరు. ఇంకా ఇతరులకు కూడా సహాయపడగలరు. కాబట్టిరోగి అయినవాడే గొప్ప వైద్యడు కాగలడు అని ఆయుర్వేదం తెలిసిన వారందరు చెప్పగలరు.

      ఆయుర్వేదంలో మన ఆరోగ్యం కోసం 85 % మనమే చాలా నియమాల్ని సహజంగా, సరళంగా పాటించి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మిగిలిన 15% మాత్రమే ఆ రంగములో ప్రత్యేక ప్రవేశమున్న వారితో సహాయం పొందవచ్చు. ఈ 15 % రోగాలు ఎప్పుడోగాని అవసరము పడవు. కాబట్టి ఆ పరిజ్ఞానం మనకు కావాలంటే మనం మన శరీరాన్ని గమనించడం. మన శరీరములోని అంగాలు వాటి ఉప అంగాలు , మన గుండె ఎక్కడ ఉంది, లివర్ ఎక్కడ ఉంది లాంటి విషయాలు తెలిస్తే ఆయుర్వేదం గురించి. బాగా అర్ధమవుతుంది.

  ఆరోగ్య మే - మహాభాగ్యం.

   సర్వేజన సుఖినోభవంతు.

  ....శ్రీ రాజీవ్ దీక్షిత్....

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: