Monday, June 5, 2017

30. వాతము దాని స్వరూపం ( మాతృ మూర్తి ) గురించి .

జై జై గోమాత ..... జై జై విశ్వమాత ( 30 ).

వాతము దాని స్వరూపం ( మాతృ మూర్తి ) గురించి .

      స్త్రీల జీవితంలో జరిగే అతి పెద్ధ పరివర్తన తల్లి కావడం . తల్లి కావడం అన్నది చాలా పెద్ద పరివర్తన . ఆ తల్లిని వాతము నుండి రక్షింపబడాలి . మన భారతీయ సంస్కృతిలో ప్రసవం అయిన తరువాత ఆ బాలింతరాలికి 40 రోజుల వరకు ఏ విధమైన కిటికీలు , వెంటిలేటర్లు లేని గదిలో ఉంచడం జరుగుతుంది . కిటికీలు లేకపోవడం వలన గమనం ఉండదు , కనుక వాయువు ఉండదు . ఆ విధంగా బాలింతరాలు వాతము నుండి రక్షింప బడుతుంది .

      ప్రసవం తరువాత స్త్రీ పొడిబారి ( శుష్కించి ) ఉండడం . ఆ శుష్కించే గుణం నుండి రక్షించడానికి నెయ్యిని ఎక్కువగా తినిపిస్తారు . బంటిపైన నూనెతో మర్ధనం చేస్తారు . ముక్కలో నూనె చుక్కలు వేస్తారు . చెవుల్లో నూనె చుక్కలు వేస్తారు . ఇలా ఒళ్ళంతా తైలమర్ధనం చేస్తారు. నాభిపై కూడా తైలం వేస్తారు . ప్రతి రోజు నాభిపై నూనె వేయడం వలన పేగులలోని వేడి తగ్గుతుంది . మలబద్ధకం తగ్గుతుంది . పెదవులు కూడా పగలవు . ఉంగలపు వేలితో ఏడు సార్లు క్లాక్ వైస్ , ఏడుసార్లు యాంటిక్లాక్ వైస్  దిశలో నాభిపై వ్రాయాలి . రాత్రి పడుకునే ముందు ముక్కులో నేతి చుక్కలు వేసుకునే సమయంలో కూడా నాభిపై నెయ్యితో వ్రాయవచ్చును . బాలింతరాలుగా ఉన్నపుడు నెయ్యి ని బాగా ఎక్కువగా తినిపించాలి .

      ప్రసవం తరువాత ఏర్పడే వ్యాక్యుంను , ఆ శూన్యస్ధితిని భర్తీ చేయడానికి వాయువు ప్రయత్నిస్తుంది. ఆ జొరబాటును నిరోధించటానికి నెయ్యి పని చేస్తుంది . కావున బాలింతరాలు నెయ్యిని బాగా తినవలెను .

       నెయ్యిని ఎక్కువగా తింటే శరీరం లావు కాదు . మొదట్లో శరీరం కొద్దిగా లావైనట్లు అనిపిస్తుంది . కానీ క్రమక్రమంగా 5 - 6 నెలల్లో శరీరం పూర్తిగా సాధారణ స్ధితికి వస్తుంది .

      ఇప్పటి వారు అసలు నెయ్యిని తినడమే లేదు . దానితో శరీరం లావు మరీ పెరిగిపోతుంది . కాబట్టి ఎంత పెద్ద పరివర్తన జరిగితే అంత పెద్ద స్ధాయిలో పరిష్కారం చేయవలసి వుంటుంది .

              " హరే కృష్ణ "
                 

             శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: