Sunday, June 4, 2017

31.వాతము దాని స్వరూపం గురించి .....

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 31 ).

వాతము దాని స్వరూపం గురించి .......

      మనకు వచ్చే రోగాలు అన్నింటిలో 70 % రోగాలు వాతం వల్ల వచ్ఛేవే . మనం వాతాన్ని బాగా గుర్తించగలిగితే ఈ 70 % వాత రోగాల నుంచి సంరక్షింపబడినట్లే . వాతము యొక్క సంబంధం మనసుతో వుంది . అందుకే జనులలో ఎక్కువగా మానసిక రోగులు ఉంటారు . అందుకే ఎవరికైనా మనసు పాడైయితే వారి శరీరానికి కూడా చికిత్సని అందించవలసి వుంటుంది . శరీరానికి చికిత్సని అందించకుండా కేవలం మనసుకే చికిత్సను అందిస్తే అది విఫలమవుతుంది .

       వాతము మన శరీరంలోకి ప్రవేశిస్తే అది వాతానికి సంబంధించిన నొప్పి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే , మీరు వేడినీళ్ళు త్రాగిన 15 నిమిషాలకే మీకు ఉపశమనం కలిగితే మీలో వాతానికి చెందిన రోగం ఉన్నట్లు .

      శరీరంలో వాతము ( వాయువు ) జొరబడి వస్తుంది . శరీరంలో వాతమునకు సమస్య వుంటే మీరు 10 - 15 నిమిషముల పాటు కాళ్ళని నొక్కిన యెడల ,  వెంటనే 5 - 6 త్రేపులు వచ్చిన వెంటనే మీకు ఉపశమనం కలుగుతుంది . ఎవరికైనా భుజాల నొప్పి వచ్చినా , తలనొప్పి వచ్చినా , ఛాతి నొప్పి వచ్చినా వారికి 10 - 15 ని !! ల పాటు కాళ్ళు నొక్కిన తరువాత వారికి ఉపశమనము కలుగును . మన శరీరం యొక్క గమనం కాళ్ళ పైన ఉంది . కాళ్ళు వాతానికి చెందిన అవయవాలు . కాబట్టి కాళ్ళను నొక్కడంతోటే శరీరంలోని వాయువు బయటకు వెళ్ళడం మొదలవుతుంది .

      అందుకే మన సంస్కృతిలో పెద్దల కాళ్ళు నొక్కడం పరంపరంగా ఉంది . ఇపుడు ఇంట్లో ఏదైనా పెళ్ళి కార్యక్రమము జరుగుతుంది . అనుకోండి అప్పుడు అంతా హడావుడి , ఎటు చూచిన సందడి క్షణం తీరిక లభించదు. అలాంటప్పుడు భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు . దీనితో గతి బాగా పెరుగుతుంది . గతి బాగా పెరిగితే ఒళ్ళంతా మాలిష్ చేసుకునే సమయం లేక పోయినా కాళ్ళను క్రింది నుంచి మోకాళ్ళ వరకూ మాలీష్  ( తైలమర్ధనం ) చేసుకోవాలి . ఆ మర్ధనం ఎప్పుడైనా క్రింది నుంచి పైకి చేయాలి . గుండె దిశగా మర్ధన చేయాలి . గుండెకు వ్యతిరేక దిశలో మర్ధనం చేయకూడదు . అలాగే పడుకునే సమయంలో ముక్కులో నెయ్యి చుక్కలు వేసుకోవాలి .

       శుభకార్యాల హడావుడి తగ్గిన తరువాత నెయ్యి బాగా తినవలెను. శుభకార్యాలలో మనం ఎంత చెత్త తిన్నా కూడా నెయ్యిని తింటే ఆ చెడును అంతటినీ శుభ్రం చేస్తుంది . నెయ్యికి విషాన్ని హరించే గుణం వున్నది . చెడిపోయిన జీర్ణ శక్తిని బాగు చేస్తుంది . శరీరంలో పెరిగిపోయిన వాతాన్ని హరిస్తుంది .

         " హరే  కృష్ణ "

                 శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: