Sunday, June 4, 2017

33.పిత్తము దాని స్వరూపం గురించి ..

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 33 ).

పిత్తము దాని స్వరూపం గురించి ...

      పిత్తము అంటే ప్రధానంగా అగ్ని తత్వం . అగ్ని + జలము తత్త్వములు కలిస్తే పిత్తము . అగ్ని లక్షణాలు 1 మండటం. 2 మెరుపు ( ప్రకాశించడం ) . 3 అగ్ని  యొక్క ఎరుపు రంగు మరియు పసుపు ఈ రంగులు శరీరానికి వస్తున్నాయిమో గుర్తించాలి .

       ఎవరికైనా శరీరం ఎక్కువగా ప్రకాశిస్తూ వుంటుందో , ఎవరి ముఖమైనా పూర్తిగా నిస్తేజంగా ఉంటే వారికి పైత్యానికి చెందిన సమస్య వున్నట్లుగా గుర్తించండి . ఎవరికైనా జ్వరం వచ్చినపుడు ముఖం ఎర్రగా మారుతుంది  శరీరంలో వేడిమి పెరుగుతుంది . జ్వరం పిత్తనాకి సంకేతం . ముఖం కందిపోవడం పిత్తము యొక్క మరో లక్షణం .

       శరీరంలో కురుపులు , పుండ్లు , ఎర్రగా  కందిన వాపులు , ఎర్రటి మరకలు , శరీరం పేలడం , ఎర్రటి వేడి పొక్కులు రావడం ఇవన్నీ పైత్యానికి సంకేతాలు . ఎర్రటి రంగు పిత్తానికి సంకేతం .

      శరీరంలో పసుపు రంగు వస్తే , శరీరం అంతా పాలిపోయినట్లు రావడం , కళ్ళు పసుపు పచ్చగా రావడం , చెమట పసుపు పచ్చ రంగులో ఉండటము ఇవన్నియు పిత్తము యొక్క లక్షణాలు . ఇలా పసుపు రంగు కనిపించినది అంటే ఇది పిత్తానికి సంకేతం .

      అగ్ని యొక్క నాల్గవ లక్షణం దుర్గంధం . మన స్వేదం దుర్గంధంగా వుండటం , నోటిలో దుర్గంధం రావటం అలాగే దుర్గంధంతో కూడిన గ్యాస్ రావడం ఇవన్నీ పిత్తాని సూచిస్తాయి .

      వేడిమి వలన ఏ పదార్ధమైనా విస్తరిస్తుంది లేదా కరుగుతుంది. ఇలా పెరగడం పిత్తము యొక్క ఐదవ లక్షణం . పై ఐదు లక్షణాలను గమనించినట్లు అయితే పిత్తమును గుర్తించ గలుగుతాము .
 
           " హరే కృష్ణ "

              శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: