Sunday, June 4, 2017

35.పిత్తము దాని స్వరూపం ( శరీరంలో ని అంగాలు చెడిపోవడం ) గురించి .....

జై గోమాత .... జై జై విశ్వమాత ( 35 ).

పిత్తము దాని స్వరూపం ( శరీరంలో ని అంగాలు చెడిపోవడం ) గురించి .....

       శరీరంలోని ఏ అంగమైనా ఎక్కువ పిత్తము కారణంగానే ఎక్కువ డామేజ్ అవుతుంది , పనికి రాకుండా పోతుంది . లివర్ , కిడ్నీ మరియు యూటిరస్ డామేజ్ అవుతాయి . గుండెలోని కవాటాలు దెబ్బతింటాయి . పాంక్రియాస్ క్లోమం దెబ్బతింటుంది . ముందుగా పిత్తము పెరుగుతుంది . తరువాత శరీర భాగాలని క్రమక్రమంగా దెబ్బతీస్తుంది. ఈ విషయం మనకు చాలా కాలం తరువాత గాని తెలియదు .

      అగ్ని యొక్క 5 లక్షణాల పైన మనము దృష్టి పెట్టినట్లు అయితే దేహంలో పిత్తం పెరిగితే తెలుస్తుంది . పిత్తం పెరుగుతున్నట్లుగా మీరు గుర్తించగానే దానికి చిక్సత చేయాలి . పిత్తమును తగ్గించడానికి మొదటగా శరీరంలో వున్న వేడిని తగ్గించ వలెను . మన శరీరంలో పిత్తము బాగా పెరిగినపుడు చల్లటి పదార్ధాలు తీసుకుంటే మన శరీర వ్యవస్ధ పూర్తిగా దెబ్బ తింటంంది . అలా చేస్తూ ఉండటం వలన పిత్తము ఒక స్ధాయిని మించి పెరుగనే పెరుగదు . మధ్యాహ్నం పూట చల్లటి పండ్ల రసం త్రాగితే పిత్తం ఇంకా పెరుగుతుంది . అందుకే మధ్యాహ్నం పూట ఎప్పుడూ చల్లటి పదార్ధాలను తీసుకోకూడదు . మీరు ప్రొద్ధున్నే చల్లటి పదార్థాలు తీసుకుంటే మధ్యాహ్నం వరకూ మీ శరీరంలో ఆ చల్లదనం వుంటుంది . అంతేకాకుండా స్ధాయికి మించి వేడి పెరగదు .

         మైగ్రేయిన్ ( పార్శ్వపు ) నొప్పి సమస్య కూడా పిత్తము యొక్క సమస్య . ఎండ పెరుగుతున్న కొద్ది ఈ పార్శ్వపు నొప్పి ఇంకా పెరుగుతుంది . అందుకే వారు ఉదయం నుంచే చల్లగా ఉంటే వేడి పెరగదు . మట్టి కుండలలోని చల్లటి నీరు తీసుకొనదగినవి . ఎవరైనా రాగి ( త్రామ ) పాత్రలోని నీరు సంవత్సర పొడవునా త్రాగుతూ వుంటే , అది మంచిది కాదు . రాగి పాత్రలలోని  నీరు కేవలం చలికాలంలో మాత్రమే త్రాగండి . వేసవిలో ఎప్పుడూ రాగి పాత్రలోని నీరు త్రాగరాదు . రాగి పాత్రలోని నీరు వేడి చేస్తాయి . ఇవియే శరీరంలోని  పిత్తాన్ని పెంచుతాయి . అది ఒకానొకదశలో మీ కిడ్నీలను డామేజ్ చెయ్యగలదు . వేసవిలో మట్టి కుండలలోని నీరు త్రాగాలి .

       మీ శరీరంలో పిత్తము ఎక్కువగా ఉంటే , వేసవిలో వెండి నాణెం లేదా స్వచ్ఛమైన వెండిని కుండలో వేసి ఆ నీరు త్రాగండి , ఆ నీరు చలువ చేస్తుంది . లేదా వెండి బిందెలోని నీరు కూడా చలువ చేస్తుంది .

        ఉదయమే కొబ్బరి నీళ్ళు , చల్లటి పండ్ల రసాలను ఉదయమే తీసుకొనవలెను . పిత్తము తగ్గుతుంది . మధ్యాహ్నం ఈ పదార్ధాలను తీసుకోవడం వలన పిత్తము పెరుగుతుంది . సాయంకాలం తీసుకోవడం వలన పిత్తము మరీ ఎక్కువగా పెరుగుతుంది . సూర్యుడు అస్తమిస్తున్న సమయమున చల్లటి పదార్ధాలను తీసుకోవడం వలన మరింత హాని జరుగుతుంది .

       సాయంత్రం నాలుగు గంటల సమయమున మీరు చల్లటి పళ్ళ రసాలను సేవించి బయటకు ( వేడిలో ) వెళ్ళ వచ్చును . అప్పుడు మీకు అవి హాని చెయ్యవు . ఇక పైన వేడి పెరుగబోతుంది అనుకున్నపుడు అంతకు పూర్వమే చలువ చేసే పదార్థం తీసుకోవచ్చును .

            " హరే కృష్ణ "

                  శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: