Sunday, June 4, 2017

36.పిత్తము దాని స్వరూపం ( దుర్వాసన ) గురించి .

జై గోమాత ...... జై జై విశ్వమాత ( 36 ).

పిత్తము దాని స్వరూపం ( దుర్వాసన ) గురించి .....

         శరీరంలో ఉష్ణం పెరిగిన యెడల చేతులు కాళ్ళకు ఎక్కువగా చెమటలు పడుతుంటే , ఆ చెమట దుర్వాసనతో కూడి వున్న యెడల , అలాగే ఎక్కువ కాలము కొనసాగిన యెడల 8 - 10 ఏళ్ళ తరువాత మీ గుండెలో చిల్లు పడుతుంది . కావున మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి .

      మూత్రం పసుపు పచ్చగా వస్తూ ఉంటే , అది క్రమక్రమంగా కిడ్నీలు చెడిపోవచ్చును , యూరిన్ ఇన్ ఫెక్షన్ రావచ్చును మరియు ఎ . యస్ . ఆర్ పెరగ వచ్చును . నీళ్ళు తక్కువ అవ్వడం వలన.కూడా మూత్రం పసుపు పచ్చగా రావచ్చును . కనుక నీళ్ళు ఎక్కువగా తీసుకుని చూడాలి . అప్పుడు కూడా మూత్రం పసుపు పచ్చగా వస్తున్నట్లయితే ఇక శరీరంలో పైత్యం పెరిగినట్లే . దానికి మరింత పెద్ద చికిత్స అవసరం . దుర్గంధాన్ని కేవలం రోగలక్షణంగా భావించాలి . ఆ దుర్వాసనకి చికిత్స చేయకూడదు . అది శరీరంలో దేని వల్ల వస్తుందో ఏమి పెరగడం వల్ల వస్తుందో దానికి చికిత్స చేయాలి . పిత్తానికి చికిత్స చేయాలి . కావున మనము శరీరానికి చల్లదనాన్ని అందించాలి .

       చాలామంది జలుబు , ముక్కు కారడం వల్ల బాధపడుతూ వుంటారు . జలుబు ( పడిశం) పట్టినప్పుడు దాదాపు పాతిక ఏళ్ళ క్రితం వేడి చేసి జలుబు చేసింది అనేవారు . కాని ప్రస్తుతం కోల్డ్ చేసింది అని అంటారు .

           " హరే కృష్ణ "

                 శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: