Sunday, June 4, 2017

37.పిత్తము దాని స్వరూపం ( జలుబు ) గురించి ..

జై గోమాత .... జై జై విశ్వమాత ( 37 ).

పిత్తము దాని స్వరూపం ( జలుబు ) గురించి ......

      జలుబు అంటే కోల్డ్ . జలుబు చేసిన పెద్దలకు , పిల్లలకు వేడి వేడి పదార్ధాలు పెడుతూ ఉంటారు . శరీరం కఫం తోటి తయారయ్యింది , ధాతువులు ఉన్నాయి . శరీరంలో వేడి పెరిగి ధాతువులు కరిగి ముక్కు ద్వారా బయటకు వస్తూంటే అతనికి పడిశం పట్టింది అని అంటాం . నిజానికి శరీరంలోని ధాతువులు కరుగుతున్నాయి . కావున శరీరానికి చలువ పదార్ధాలను అందిస్తే ఈ ధాతువులు కరగడం ఆగుతుంది. అల్లోపతిని విశ్వసించని వారు వేడి వేడి కషాయలను ఇస్తారు . తులసి కషాయాన్ని కానీ , పసుపు కషాయాన్ని గానీ ఇస్తారు . అలా చేయడం వలన శరీరంలో వేడి ఇంకా పెరిగిపోతుంది . ఈ కషాయాలు తీసుకోవడం వలన గొంతులోనూ , ముక్కులోనూ అతుక్కుని ఉన్న కఫం వెంటనే బయటకు వెళ్ళి పోతుంది . ఈ ఉపశమనం తాత్కాలికం మాత్రమే .

      జలుబు చేసిన వారు వేడి.వేడి టీ త్రాగడం , వేడి వేడి పదార్ధాలు తీసుకుని లోపల ఉన్న జలుబును అణచి వేయటం సరయైన పద్ధతి కాదు . ఏడు లేక ఎనిమిది ఏళ్ళ నుంచి జలుబు సమస్యతో బాధపడుతున్న చున్నవారు ప్రొద్దున్నే కొబ్బరి నీళ్ళు త్రాగండి . పానీయాలు త్రాగకండి . తేనెను చలికాలంలో తీసుకోండి . ఎక్కువగా చలువ చేసే పదార్ధాలను తీసుకొనవలెను .

            " హరే కృష్ణ "

              శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: