Sunday, June 4, 2017

38.పిత్తము దాని స్వభావము ( పసి పిల్లల విరేచనాలు -- ముల్లంగి దుంప ) గురించి .

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 38 ).

పిత్తము దాని స్వభావము ( పసి పిల్లల విరేచనాలు -- ముల్లంగి దుంప ) గురించి .....

       తల్లి పాలు త్రాగే పసి పిల్లలకు నీళ్ళ విరోచనాలు ఎక్కువగా అవుతుంటే , ఆ తల్లి ముల్లంగి దుంపలను ఉదయమే తినాలి . అపుడు ఆ తల్లి పాలను త్రాగిన పసి పిల్లలకు విరోచనాలు వెంటనే తగ్గుతాయి . ఆ తల్లి ముల్లంగి దుంపలను ఉదయమే తినాలి . మధ్యాహ్నం కాని , సాయుంకాలం కాని ఏ సమయంలోను తినరాదు . అలా మూడు రోజులు తల్లి ముల్లంగి దుంపలను తిన్నాక పాప విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి . తల్లి బాలింతరాలుగా ఉన్నపుడు కొన్ని వేడిచేసే పదార్థాలు తినిపిస్తారు . ఆ వేడి తగ్గించటానికి నెయ్యిని తినిపించాలి . వారు అలా నెయ్యిని తిని ఉండరు . కనుక ఆ వేడి పాల రూపములో తల్లి నుండి పిల్లకు చేరింది . ఆ వేడి వలన పాపకు నీళ్ళ విరోచనాలు అయినాయి . ఇప్పుడు తల్లి ఉదయాన్నే ముల్లంగి తినడం వల్ల ఆ వేడి తగ్గి చలువ చేసింది . ఆ తల్లి పాలు చలువ చేస్తాయి . ఆ పాలు త్రాగి పాపకు చలువ చేసింది . నీళ్ళ విరోచనాలు తగ్గిపోయాయి .

      ఈ ముల్లంగి ఎప్పుడు తినాలి అనే సిద్ధాంతం తెలిసినట్లు అయితే దాని వలన ప్రయోజనం కలుగుతుంది . ముల్లంగిని ఉదయమే తీసుకోవాలి . మనం మధ్యాహ్నం తిన్నట్లు అయితే అది సైడ్ ఎఫెక్ట్ కలుగుతుంది . ముల్లంగి ఎక్కువగా పండే కాలములోనే ఈ చలువ చేసే గుణం వుంటుంది . ముల్లంగి పండని కాలంలో మీకు దొరికినా మేలు చేయదు , పైగా హాని చేస్తుంది .

          " హరే కృష్ణ "

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: