Sunday, June 4, 2017

39.పిత్తము దాని స్వభావము ( శరీర భాగాలను దెబ్బ తీయడము ) గురించి ...

జై గోమాత ...... జై జై విశ్వమాత ( 39 ).

పిత్తము దాని స్వభావము ( శరీర భాగాలను దెబ్బ తీయడము ) గురించి ......
ప్రతి వ్యక్తి శరీరంలో ఒక్క శరీర భాగం అయిన బలహీనంగా ఉంటుంది . ఇతర శరీర అవయములతో పోల్చితే ఒక భాగం బలహానంగా ఉంటుంది . ఆ కారణంగా రోగం ఎప్పుడూ ఆ శరీరభాగంపైననే దాడి చేస్తుంది . ఎవరికైనా శరీరంలో లివర్ బలహీనంగా ఉన్నదనుకోండి వారికి శరీరంలో పిత్తం పెరిగితే , అప్పుడు లివర్ పైనా దాడి జరుగుతుంది . మనం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి లివరకు సంబంధించిన మందులను వాడతాము . అప్పుడు లివర్ కు సంబంధించిన రోగం బాగవతుంది . కానీ వారు పిత్తాన్ని శరీరం నుండి బయటకు పంపకపోవడం వలన ఆ పైత్యం పెరిగి కిడ్నీని పాడు చేస్తుంది .

      కిడ్నీ చెడిపోయినప్పుడు నెఫ్రాలజిస్ట్ చెడిపోయిన కిడ్నీని శరీరంలో నుండి బయటకు తీసి వేస్తాడు . కాని శరీరంలో పైత్యం మాత్రం అలాగే ఉంటుంది . అప్పుడు ఆ పిత్తము గుండె కవాటంలో చిల్లు పడేటట్లు చేస్తుంది . కార్డియాలజిస్ట్ చెడిపోయిన వాల్వ్ ను  రిప్లేస్ చేస్తాడు . కానీ , తాను కూడా పిత్తాన్ని వెలికి తీయలేదు . ఇక ఆ తరువాత ఆ పిత్తము స్త్రీలకు యూట్రస్ లోకి చేరుతుంది . గైనకాలజిస్ట్ ఆ గర్భాశయాన్నీ తీసివేస్తారు . కానీ తనూ పిత్తాన్ని బయటకు తీయడు .

      మనం డాక్టర్లను అయితే మారుస్తున్నాం . కానీ దేని కారణం చేత ఈ రోగాలన్నీ వచ్చాయో ఆరోగ కారణాన్ని మాత్రం తొలగించడము లేదు . అదే నేడు ఉన్న అతి పెద్ద సమస్య . ఇదంతా ఎందుకు జరుగుతుంది . అనేది ఆ డాక్టర్లుకూ అర్ధం కాదు . మనకూ అర్ధం కాదు . అందువలననే ఈ రోజు ఇంతగా వ్యాధులు ప్రబలుతున్నా వాటి మూలకారణాన్ని ఎవ్వరూ గ్రహించక పోవటం వలన ఇన్ని సమస్యలు ఎదురు అవుతూ ఉన్నాయి .

          " హరే కృష్ణ "

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: