Monday, June 5, 2017

3.మన భోజనం గురించి....మన ఆరోగ్యం

మన ఆరోగ్యం ---- మనచేతుల్లో (3)

మన భోజనం గురించి.....

      మనం తినే భోజనం గురించి బాగా తెలుసుకుంటే మనకు ఎప్పటికో గాని వైద్యుని అవసరంరాదు. భోజనాన్ని అర్ధం చేసుకోవటం అంటే మనవంటింటిని అర్ధం చేసుకోవటం ఆన్నమాట. ఇదే గొప్ప విజ్ఞానం, అన్నింటికన్నా గొప్ప పరిశోధన వంటింట్లోనే ఉంది. భారతదేశంలో జరిగినంతగా భోజన ( పాకశాస్త ) పరిశోధన ప్రపంచములో ఏదేశములో కూడా గడచిన వెయ్యేళ్ళలో జరుగలేదు. భారతీయుల భోజనములో షడరసాలు (ఆరు) రుచులు ఉంటాయి. ఇది మన దేశము యొక్క గొప్పతనం. ఇది మనకు అర్ధమైతే వాగ్భట ఋషి ( 135 సంత్సరాలు జీవించారు ) చెప్పే ఆయుర్వేద విషయాలు అర్ధమవుతాయి. వాగ్భట ఋషి వ్రాసినవి 7000 సూత్రాలు. అందులో 15 సూత్రాలు అత్యంత ప్రధానమైనవిగా మనం గుర్తించాలి.

      మొదటి సూత్రం :  ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురు తగులుతూ వుండవలెను. మనం వండుకునే ఏ ఆహారానికైన సూర్యుని కాంతి, గాలి తగలని యెడల ఆ ఆహారాన్ని మనము తినకూడదు. ఎందుకంటే అది ఆహారము కాదు. విషముతో సమానమని వాగ్భటాచార్యుని సూత్రము.

ప్రెషర్ కుక్కర్:   ఈ ప్రెషర్ కుక్కర్ లో ఆహారం వండేటప్పుడు ఏ మాత్రమూ గాలి , సూర్యరశ్మి తగిలే అవకాశము లేదు. ఇది పూర్తిగా విషతుల్యము. మరొక ప్రమాదకర విషయం ఏమిటంటే , ఈ ప్రెషర్ కుక్కరు తయారు చేసేది అల్యూమినియంతో. ఆహారం వండటానికి గానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికి రానిది ఈ అల్యూమినియం పాత్రలు. ఈ పాత్రలోని ఆహారుం మళ్లీ మళ్ళీ తింటూ వుంటే వారికి మథుమేహం , జీర్ణసంబంధిత , టి.బి. ఆస్తమా మరియు కీళ్ళ సంబంధ వ్యాధులు తప్పకుండా వస్తాయి.

       ప్రెషర్ అనగా ఒత్తిడి. అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్ధం ఒత్తిడికి గురై త్వరగా మెత్త ఒడుతుంది. కానీ ఉడకదు. అంటే పదార్థం ఉడకడం వేరు , మెత్త ఒడడం వేరు. గింజలోని అన్ని రకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్ధం వండ ఒడాలి , మెత్త ఒడితే సరిపోదు. ఇది ప్రకృతి ధర్మం , ఆయుర్వేద సిద్ధాంతం.

మట్టి పాత్రల విశిష్టత :-
  మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి , సూర్యరశ్మి తగిలేలాగ ఆహారం వండుకోవాలి. అందుకు అత్యుత్తమైన పాత్ర మట్టిపాత్ర.

    మట్టి పాత్రలలో వండిన ఆహారం నిత్యం తింటూ వుంటే మన శరీరానికి కావలసిన 18 రకాల.మైక్రోన్యూట్రియన్స్ లభిస్తాయి. భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు , వాటిలో వండితే ఉండే పోషక విలువల ని ష్పత్తి :

మట్టికుండలో  ---- 100%

కంచు పాత్రలో ----- 97%

ఇత్తడి పాత్రలో ----- 93%

అల్యూమినియం
ప్రెషర్ కుక్కర్ లో ---7%--13%
వరకు ఉంటాయి.
     మట్టిపాత్రలో వండిన పదార్ధానికి రుచి కూడా అద్భతంగా ఉంటుంది. మన పూర్వీకులు ఒక్క మట్టి పాత్రలో భుజించటం వలన వారు జీవించినంతవరకు వారికి కళ్ళజోడు రాలేదు , పళ్ళు ఊడిపోలేదు , మోకాళ్ళ నొప్పులు , డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన నూట్రియన్స సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన అన్ని పనులు మనమే ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం.
      డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైన ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి. సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా వారు డయాబెటిస్ రోగం నుండి విముక్తులమవుతారు. ఆనందంగా జీవిస్తారు. ఇదే మన వాగ్భటాచార్యుని మొదటి సూత్రః.

"సర్వేజన సుఖినోభవంతు "

"ఆరోగ్యమే మహాభాగ్యం"

---శ్రీ రాజీవ్ దీక్షిత్ .... 🙏

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: