Sunday, June 4, 2017

40.పిత్తము దాని స్వభావము ( కిడ్నీ సమస్యలు... దాని నివారణ ) గురించి .......

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 40 ).

పిత్తము దాని స్వభావము ( కిడ్నీ సమస్యలు... దాని నివారణ ) గురించి .......

      పిత్తాన్ని తగ్గించాలి అనే విషయాన్ని ముందుగా గుర్తించామనుకోండి చాలా అనారోగ్య సమస్యలు ముందుగానే పరిష్కరింపబడతాయి .

     భగవంతుడు అద్భుతమైన శరీరాన్ని సృష్టించినాడు . శరీరంలో ఒక శరీరానికి ఏమైన జరిగితే ఆ సమయంలో ఆ అంగానికి సహాయం చెయ్యటానికి వేరొక అంగాన్ని సృష్టించినాడు .

      మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చెయ్యటం , అందులోని చెడును నీటి రూపంలో బయటకు పంపడం . ఈ పనిని చర్మమూ చేస్తుంది . కిడ్నీలు దెబ్బతిన్న రోగికి చర్మం నుంచి సాధ్యమైనంత ఎక్కువగా చెమటలు పట్టేలాగా చేయాలి . కాని ఆ రోగిని ఎ.సి. లో ఐ .సి . యు . లో ఉంచుతున్నారు . అపుడు చెమటలు ఎలా పడతాయి . పైగా 1 లీటరు కంటే ఎక్కువ మంచి నీళ్ళు త్రాగకూడదు అంటారు . ఒక లీటరు కంటే ఎక్కువ నీళ్ళు త్రాగకపోతే పైత్యం ( పిత్తం ) పెరుగుతుంది . పిత్తం బాగా పెరగడం వలన ఆ రోగికి డయాలిసిస్ తప్పని సరి . ఇంకా పిత్తం పెరిగినయెడల మూత్ర పిండముల మార్పిడి తప్పనిసరి . కావున ఈ కిడ్నీ యొక్క పనిని చర్మం తీసుకునే విధంగా సాధ్యమైనంత ఎక్కువగా చెమటలు పట్టేటట్లు స్టీమ్ బాత్ చేయాలి . రోగి త్రాగే నీటిని ఒక లీటరుకే పరిమితం చెయ్యకూడదు . 2 1/2 లేక 3 లీటర్ల నీటిని తాగినా ఆ నీటిలో 1 1/2 లీటర్ల నీటిని చెమట రూపంలో బయటకు తెప్పించాలి . నీళ్ళు తక్కువగా తాగడం వలన రక్తం చిక్కబడుతుంది . రక్తం చిక్కబడటం వలన తేలికగా వడకట్టబడదు . ఏ పదార్ధమైనా ఎంత పలుచగా ఉంటేనే ఆంత తేలికగా వడకట్ట బడుతుంది . రక్తం పలుచగి ఉంటే తేలికగా వడకట్టబడుతుంది .

      కిడ్నీ రోగులకు స్టిమ్ బాత్ ఇప్పించి శరీరానికి ఎక్కువ చెమటలు పట్టేలాగా చెయ్యాలి . అలా చేయడం వలన ఆ శరీరంలోని పైత్యం తగ్గుతుంది . ఆ రోగి కాళ్ళకు శుద్ధమైన ఆవు నెయ్యి ఆవు నెయ్యి పూసి కంచు పాత్రతో అరి కాలిపై రాపిడి చెయ్యాలి . చలువ చేసే పదార్ధాలను త్రాగించాలి . అలా చెయ్యటానికి బదులు మధ్యాహ్నం రోగికి కొబ్బరి నీళ్ళు తాపిస్తున్నారు . మరి అతనికి ఎలా నయమవుతుంది . ఆ వ్యక్తి నుదిటిపై అంగరాగాన్ని లేపనం చెయ్యాలి . అలా చేయడం వలన నుదిటి భాగంలో పిత్తము పెరుగదు .

      వాతానికి ముఖ్యమైన అవయం పెద్ద ప్రేగులు , పైత్యమునకు ముఖ్యమైన అంగం చిన్న ప్రేగులు . పిత్తం చిన్న ప్రేగులలో వుంటుంది .  పిత్తం తగ్గించడానికి ఆముదంతో తయారు చేయబడిన మందు విరేచనానికి ఇవ్వవలెను . వేరు వేరు విధాలైన విరేచనాన్ని ఇవ్వవలెను . ఒక వ్యక్తికి ఎటువంటి విరేచనాన్ని సరిపోతుంది . అనే విషయాన్ని కేవలం వైద్యుడే గుర్తించ గలుగుతాడు . బలహీనమైన వాళ్ళకి చాలా తక్కువ ఆముదాన్ని ఇచ్చి పిత్తాన్ని నివారించ వచ్చు .ళ

       చిన్న ప్రేగులకు ఆముదాన్ని ఇచ్చి పిత్తాన్ని బయటకు పంపవలెను . శరీరానికి చల్లదనాన్ని అందచేయాలి . పైత్యాన్ని వెంటనే తగ్గించాలి . ఇలా చేయకుండా ఆ వ్యక్తిని ఎ.సి. లో ఉంచుతాం , దాని వల్ల ఆ రోగిలోని వేడి ఆ రోగిలోనే ఉండిపోతుంది . లోలోపల ఆ వేడి ఇంకా పెరిగిపోయి కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అవుతాయి . ఒక చిన్న విషయాన్ని అర్ధం చేసుకోలేని కారణంగా ఎంత పెద్ద సమస్య బారిన పడుతున్నామో మనం అర్ధం చేసుకోవచ్చు .

           " హరే కృష్ణ "

              శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: