Sunday, June 4, 2017

42.కఫము దాని స్వరూపము గురించి ....

జై గోమాత ..... జై జై విశ్వమాత  ( 42 ).

కఫము దాని స్వరూపము గురించి ......
     
       శరీరం యొక్క నిర్మాణం కఫం వలన జరుగుతుంది . జలము +  పృధ్వీ తత్త్వములు కలిస్తే కఫం. కఫం భారంగా  ఉంటుంది , జిగటగా జిగురుగా ఉంటుంది . చల్లగా ఉంటుంది .  కఫం యొక్క గమనం నెమ్మదిగా ఉంటుంది . కఫంకు అతుక్కునే స్వభావం కలిగి ఉంటుంది . జీర్ణకోశం , అన్న వాహిక ఈ రెండూ  కఫం యొక్క స్ధానాలు .

      కఫం బరువును కూడా పెంచుతుంది . లావుగా ఉన్న వాళ్ళు వాతం వలన కుడా లావుగా ఉంటారు . వాతమును నియంత్రించడంతోటే చాలా బరువును కోల్పోతారు . కానీ ఆ బరువు కఫం వలన కూడా ఉంటే వాతము బక్కటే నియంత్రించినంత మాత్రానా ఆ వ్యక్తి బరువు పూర్తిగా తగ్గదు . కఫాన్ని తగ్గించటానికి గోమూత్రం అవసరం . ఇంకా ఏదైనా వేడి చేసే వస్తువులు తీసుకోవాలి .

      వాతంలోను , కఫంలోను సమానంగా ఉండే ఒకే ఒక లక్షణం చల్లదనం . తక్కిన లక్షణాలన్నీ పూర్తిగా వ్యతిరేకమైనవి . వాయువు పొడి పొడిగా ఉంటే కఫం జిగురు జిగురుగా ఉంటుంది . వాయువు యొక్క గతి ఎంతో  అత్యంత వేగవంతం కాగా కఫం యొక్క గతి ఎంతో నెమ్మదిగా ఉంటుంది . అందుకే వాతము కఫము పరస్పరం విరుద్ధంగా ఉంటాయి . వాతము యొక్క సంబంధం మనసుతోనూ పిత్తం యొక్క సంబంధం బుద్దితోనూ ఉన్నట్లుగానే కఫం యొక్క సంబంధం అహంకారంతో ఉంటుంది .

      నేను అన్నది దేనితో నైనా మెళవించి వున్నప్పుడు అది అహంకారం . దీనిలో జడత్వం వుంది . ఒక వ్యక్తిలో జడత్వం ప్రవేశిస్తే తాను ఒక పట్టాన మారడు . అందుకే కఫతత్వం ఉన్నవాళ్ళు వెను వెంటనే రోగ గ్రస్తులు అవుతూ ఉంటారు . వీళ్ళు రోగ గ్రస్తులు అయితే దీర్ఘ రోగులు అయిపోతారు .

        ' హరే కృష్ణ '

             శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: