Sunday, June 4, 2017

44.ఇతర స్వరూపముల గురించి .... ( పిల్లలపైన వాత పిత్త కఫ ప్రభావం ) .

జై గోమాత ...... జై జై విశ్వమాత (44 ).

ఇతర స్వరూపముల గురించి ....
( పిల్లలపైన వాత పిత్త కఫ ప్రభావం ) .

      వాత , పిత్త కఫములలో పరస్పర సంబంధాన్ని గురించి ఒక చిన్న సూత్రము . ఎంతో ప్రయోజనకరమైనది , వ్వవహార యోగ్యమైనది . చాలా సార్లు రోగాలు కేవలం వాతానికో , పిత్తానికో , కఫానికో చెందినవి మాత్రమే ఉండవు . వాతము + పిత్తమునకు చెందిన రోగాలు గాని , పిత్తము + కఫమునకు చెందిన రోగాలు గాని ఉంటాయి . 70 % రోగాలు వాతానివి , 40 % రోగాలు పిత్తానివి , 20 % రోగాలు కఫానివిగా ఉంటాయి . వీటి మధ్య పరస్పర కాంబినేషన్ కూడా వుంటుంది . అందుకే వీటి పరస్పర సంబంధాన్ని అర్ధం చేసుకోవాలి .

      పిల్లలలో కఫానికి ప్రాధాన్యత ఉంటుంది . యవ్వనములో పైత్యానికి ప్రాధాన్యత ఉంటుంది . వృద్దులలో వాతానాకి ప్రాధాన్యత ఉంటుంది .

      పిల్లలలో వాతానికి ప్రాధాన్యత కనిపించినది .  అంటే ఆ పిల్లవాడు చాలా త్వరగా ముసలివాడు అవుతాడని అర్ధం . ఈ హైపర్ యాక్టివిటి అనేది చాలా భయంకరమైన రోగం . పిల్లవాడు హైపవర్ యాక్టివ్ అయ్యాడు అంటే తనలో చంచలత్వం ఎక్కువ ఉన్నదని కాదు దాని అర్ధం . తాను త్వరగా ముసలి వాడుగా అవుతున్నాడని అర్ధం . బాల్యంలోనే తన శక్తిని నాశనం చేసుకుంటున్నాడు . ఈ రోజులలో పిల్లలు ఎక్కువగా హైపవర్ యాక్టివిటీని తగ్గించే " వెన్నన్ని " పిల్లలకు పెట్టడం లేదు . ఎటువంటి పదార్ధాల వల్ల ఈ హైపవర్ యాక్టివిటీ ఇంకా పెరుగుతుందో అటువంటి ఆహారపదార్ధాలనే పిల్లలకు పెడుతున్నాము .

      వాత , పిత్త , కఫములకు సంబంధించిన విషయములపై శ్రద్ధ వహించండి . బాల్యంలో వాతం పెరగటం ఏ మాత్రమూ  మంచిది కాదు . పిల్లవాడు వాత ప్రథాన ప్రకృతి కలవాడై ఉండవచ్చు . దీని వల్ల తనలో గొప్ప కల్పనా చాతుర్యం ఉండవచ్చు , చలాకిగా ఉండవచ్చు , చొచ్చుకుని పోయే స్వభావం ఉండవచ్చు . కానీ వాతం యొక్క వికృతి పూర్తిగా వేరు . వాత వికృతి వలన రెండు విభిన్న విషయాల మధ్య సమన్వయం చెయ్యలేక పోతాడు . లింకు కోల్పోతాడు . ఇది వాతము వికృతి .

          ' హరే కృష్ణ '

               శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: