Sunday, June 4, 2017

45.ఇతర స్వరూపముల గురించి .... ( పిల్లలపైన వాత , పిత్త , కఫ ప్రభావం )

జై గోమాత ...... జై జై విశ్వమాత ( 45 )

ఇతర స్వరూపముల గురించి ....
( పిల్లలపైన వాత , పిత్త , కఫ ప్రభావం )

       పిల్లలు యాక్టివ్గా ఉండటం వాతం యొక్క లక్షణం . కాని హైపర్ యాక్టివ్గా ఉండటం వాతము యొక్క వికృతి . పిల్లలు ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని ఏకాగ్రంగా పరిశీలించ గలుగుతున్నారు . అంటే యాక్టివ్గా ఉన్నట్టు . ఏకాగ్రత పెట్టవలసిన చోట ఏకాగ్రత పెట్టలేక పోతున్నాడంటే హైపర్ యాక్టివ్ యాక్టివ్ అయిపోయినట్లు . ఈ హైపవర్ యాక్టివిటీ చాలా భయంకరమైన జబ్బు . పిల్లలను వార్ధక్యంలోకి తీసుకుని పోయే జబ్బు . పిల్లలు కఫం ప్రధానంగా కలిగి ఉంటారు . కాబట్టి వారికి " వెన్న " తినిపించిన యెడల వారు హైపవర్ యాక్టివ్ అవ్వరు . పిల్లలో కఫం ఎక్కువగా ఉంటుంది . యవ్వన అవస్ధలో పిత్తము ఎక్కువగా ఉంటుంది . అందుకే మీరు ఈ విషయం లోతుగా పరిశీలించాలి .

     కఫం వారికి జ్ణాపక శక్తి బాగా ఉంటుంది . అర్ధమే చేసుకోలేక పోవడం కానీ ఒక సారి అర్ధమైతే  మాత్రం ఎప్పటికీ మరచిపోక పోవడం . ఇది కఫ ప్రకృతి ఉన్న వారి లక్షణం . పిల్లలకు విషయాన్ని వివరించ వలసిన అవసరం లేదు . విషయాన్ని బట్టీ  వివరించ వలసిన అవసరం ఉంది . ఎందుకంటే వారిలో విశ్లేషణా సామర్ధ్యం ఇంకా ఎదుగనే లేదు . వాళ్ళలో పిత్తము ఇంకా ఆ స్ధాయిలో వికసించ లేదు . ఇప్పటి వరకూ కఫం మాత్రమే వికసితమైనది . కనుక వారి చేత కంఠంస్ధం చేయించాలి . గీతా శ్లోకాలను , స్తోత్రాలను , మంత్రాలను కంఠంస్ధం చేయించండి . వాళ్ళు అర్ధం చేసుకోలేరు . కాని వారు పెరిగి పెద్ధ వారు అయిన తరువాత వాటిని విశ్లేషించ గలుగుతారు .

      పిల్లలు వృద్ధులు అయినపుడు వారు ఏ విషయాలనైతే విశ్లేషించారో వృద్ధాప్యంలో వికసించే పకృతి వలన వారిలో పెరిగే కల్పనా సామర్ధ్యంలో జీవించగలుగుతారు . అపుడు వారు సమాజానికి ఎంతో మార్గ నిర్దేశం చెయ్య గలుగుతారు .

       ప్రస్తుతం , తల్లి దండ్రులే పిల్లల చేత అశ్లీలమైన సినిమా పాటలు బట్టీ పట్టిస్తున్నారు . సినిమా డాన్స్ లు చేయిస్తున్నారు . చిన్న పిల్లలు టి. వి . లో ముసలి వాళ్ళలాగా వేషాలు వేసి చాలా దారుణమైన మాటలు మాట్లాడుతుంటారు .  ఇలాంటి మాలిన్యాన్ని  మనం వారి బుర్రలకు ఎక్కిస్తే వారు ఎదిగిన తరువాత ఈ మాలిన్యాన్నే విశ్లేషిస్తారు . ఇక వాళ్ళు ముసలి వారుగా అయిన తరువాత ఎలా తయారవుతారో మీరే ఊహించండి . వారి నుంచి శుభకరమైన సత్సంసంకల్పాలను మనము ఊహించలేము .

      బాల్యంలో పిల్లల చేత సత్ విషయాలను కంఠంస్ధం చేయించండి .

       ఈ విధంగా వాత , పిత్త , కఫాలను గురించి అర్ధం చేసుకోండి .

         " హరే కృష్ణ "

           శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: